Vijayendra Prasad About RRR Sequel: ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీసును బద్దలు కొడుతున్న ఆర్ఆర్ఆర్.. ఇప్పటికే ఏడు వందల కోట్ల క్లబ్ లో చేరి పోయింది. మరిన్ని రికార్డులు బద్దలు కొట్టడానికి శరవేగంగా దూసుకుపోతోంది. మొదటి వారమే ఈ రేంజ్ లో కలెక్షన్లు రాబట్టింది అంటే.. రెండో వారం ఏ కొంచెం తగ్గినా.. అది సినిమాకు పెద్దగా మైనస్ అవ్వదు. జక్కన చెక్కిన ఈ మాయాజాలం.. ఈ భాష భాష అనే తేడా లేకుండా సినీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
అన్ని భాషల్లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఈ సినిమాలో.. కొమరం భీంగా ఎన్టీఆర్.. రామ రాజు పాత్రలో రామ్చరణ్ జీవించేశారనే చెప్పుకోవాలి. స్క్రీన్ మీద వీరిని చూస్తున్నంత సేపు ఆ పాత్రలు గుర్తుకు వస్తాయి తప్ప.. వాళ్లు హీరోలు అని ఎవరు పట్టించుకోరు. అంతలా ఈ కథను తెరకెక్కించారు రాజమౌళి. ఇంతటి అద్భుతమైన కథను రాసింది రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్. ఈయన పాన్ ఇండియా సినిమాలు ఎక్కువగా కథలు రాస్తుంటారు.
Also Read: Telangana Politics: మూడు పార్టీలది తలోదారి.. లక్ష్యం మాత్రం ఒక్కటే.. గెలిచేదెవరు..?
బాహుబలి లాంటి విజువల్ వండర్ కూడా ఈయన కలం నుంచి వచ్చిందే. అయితే ఇప్పుడు త్రిబుల్ ఆర్ సినిమా చూసిన వారంతా ఒక విషయాన్ని తెరమీదకు తెస్తున్నారు. బాహుబలి లాగే త్రిబుల్ ఆర్ కు సీక్వెల్ ఉంటుందా అని అడుగుతున్నారు. కాగా ఈ ప్రశ్నలపై తాజాగా విజయేంద్రప్రసాద్ స్పందించారు.
సినిమా విజయోత్సవంలో భాగంగా ఇంటర్వ్యూలు ఇస్తున్న ఆయన.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ రోజు ఎన్టీఆర్ తమ ఇంటికి వచ్చి త్రిబుల్ ఆర్ సీక్వెల్ గురించి అడిగాడని చెప్పుకొచ్చారు. అప్పుడు తాను చెప్పిన కొన్ని ఐడియాలు ఎన్టీఆర్ కు, అలాగే రాజమౌళికి బాగా నచ్చాయని వివరించారు. ఒకవేళ దైవానుగ్రహం ఉంటే ఈ ఐడియాలు సీక్వెల్ గా తెరకెక్కే అవకాశం ఉంటుందని విజయేంద్రప్రసాద్ స్పష్టం చేశారు. ఆయన మాటలను బట్టి చూస్తుంటే ఇప్పుడు కాక పోయిన తర్వాత అయినా త్రిబుల్ ఆర్ మూవీ కి సీక్వెల్ ఉంటుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Also Read: Tollywood Heros Real Names: ఈ హీరోల పేర్లు ఇవి కావు.. అసలు పేర్లు ఇవిగో..