https://oktelugu.com/

Tholiprema – Pawan Fans : : విజయవాడ ‘తొలిప్రేమ’ సినిమా ప్రదర్శనలో అభిమానులు అత్యుత్సాహం..థియేటర్ స్క్రీన్ ని అడ్డం గా చించేసి ఫ్యాన్స్!

అయితే వాళ్ళ హంగామా హద్దులు దాటి విజయవాడలోని కపార్డీ అనే థియేటర్ లో వెండితెర ని చించేసి స్థాయికి చేరింది. ఎదో చిన్నగా చిరిగిపోయిన పర్వాలేదు, తక్కువ డ్యామేజీ తోనే రికవర్ చేయొచ్చు. కానీ ఇక్కడ స్క్రీన్ ని 90 శాతం చించేశారు. స్క్రీన్ చిరిగిపోయిన కూడా, ఆ చిరిగిన స్క్రీన్ తోనే ఆట ని ప్రదర్శించారు.

Written By:
  • Vicky
  • , Updated On : July 1, 2023 12:23 pm
    Follow us on

    Tholiprema – Pawan Fans : ఈమధ్య కాలం లో రీ రిలీజ్ సినిమాల జోరు టాలీవుడ్ లో మామూలు రేంజ్ లో లేదు. అభిమానులు తమ అభిమాన హీరో సూపర్ హిట్ మూవీస్ ని 4K HD క్వాలిటీ కి మార్చి విడుదల చేయించుకొని కొత్త సినిమా విడుదల అయితే ఎలాంటి హంగామా చేస్తారో, ఈ రీ రిలీజ్ చిత్రాలకు కూడా అదే రేంజ్ హంగామా చేస్తున్నారు. అభిమానులు అన్న తర్వాత ఆ మాత్రం హంగామా చెయ్యకుండా ఎందుకు ఉంటారు. కానీ ఆ హంగామా హద్దులు దాటి థియేటర్స్ ని తగలపెట్టడం, స్క్రీన్స్ ని చింపేయడం వరకు వెళ్ళింది. ఇది నిజం గా అత్యంత నీచమైన చర్య గా భావించొచ్చు.

    రీసెంట్ గానే జూనియర్ ఎన్టీఆర్ సింహాద్రి సినిమా విడుదలప్పుడు అభిమానుల అతి ఉత్సాహం వల్ల థియేటర్ లో సీట్స్ మొత్తం తగలబడిపోయింది,ఇక నిన్న పవన్ కళ్యాణ్ నటించిన ‘తొలిప్రేమ’ చిత్రం విడుదల అయ్యింది. ఈ సినిమాకి నిన్న అభిమానులు మామూలు రేంజ్ హంగామా చెయ్యలేదు.

    అయితే వాళ్ళ హంగామా హద్దులు దాటి విజయవాడలోని కపార్డీ అనే థియేటర్ లో వెండితెర ని చించేసి స్థాయికి చేరింది. ఎదో చిన్నగా చిరిగిపోయిన పర్వాలేదు, తక్కువ డ్యామేజీ తోనే రికవర్ చేయొచ్చు. కానీ ఇక్కడ స్క్రీన్ ని 90 శాతం చించేశారు. స్క్రీన్ చిరిగిపోయిన కూడా, ఆ చిరిగిన స్క్రీన్ తోనే ఆట ని ప్రదర్శించారు. ఇక నంద్యాల లో ఇలాంటి పరిస్థితి రాలేదు కానీ, వెండితెర మీద పవన్ కళ్యాణ్ రాగానే స్క్రీన్ పై ఒక అభిమాని పాలాభిషేకం చేసాడు.

    దీనితో స్క్రీన్ పాడైపోయింది, ఇప్పుడు దానిని క్లీన్ చేస్తే రంగు పొయ్యే ప్రమాదం ఉందని థియేటర్ ఓనర్ అంటున్నాడు. ఇలా కేవలం పవన్ కళ్యాణ్ అభిమానుల విషయం లోనే కాదు, ఎన్టీఆర్ అభిమానులు, మహేష్ అభిమానులు మరియు ప్రభాస్ అభిమానుల విషయం లో కూడా ఇలాంటి సంఘటనలు చాలానే చోటు చేసుకున్నాయి. ఇదే పరిస్థితి కనుక భవిష్యత్తులో కొనసాగితే ఇక రీ రిలీజ్ కి థియేటర్స్ ఎవ్వరూ కూడా ఇవ్వరు అని అంటున్నారు ట్రేడ్ పండితులు.