ఊపిరి పీల్చుకున్న ఫ్యాన్స్.. స్టార్ హీరో సేఫ్ !

స్టార్ హీరో, డీఎండీకే పార్టీ అధినేత కెప్టెన్‌ ‘విజయ్‌ కాంత్‌’ తీవ్ర అస్వస్థతకు గురి అయి చెన్నైలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే, ఆయన హెల్త్ కి సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్ ఏమిటంటే.. విజయ్ కాంత్‌ ఈ రోజు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం విజయ్ కాంత్ ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆయన కోలుకొని ఇంటికి చేరుకున్నారని డీఎండీకే పార్టీ అధికారులు అధికారికంగా ప్రకటించారు. విజయ్ కాంత్ ఆరోగ్యం […]

Written By: admin, Updated On : May 21, 2021 3:41 pm
Follow us on

స్టార్ హీరో, డీఎండీకే పార్టీ అధినేత కెప్టెన్‌ ‘విజయ్‌ కాంత్‌’ తీవ్ర అస్వస్థతకు గురి అయి చెన్నైలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే, ఆయన హెల్త్ కి సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్ ఏమిటంటే.. విజయ్ కాంత్‌ ఈ రోజు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం విజయ్ కాంత్ ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆయన కోలుకొని ఇంటికి చేరుకున్నారని డీఎండీకే పార్టీ అధికారులు అధికారికంగా ప్రకటించారు.

విజయ్ కాంత్ ఆరోగ్యం పై సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు రాస్తున్నారని, ప్రస్తుతం ఆయన క్షేమంగా ఉన్నారని, అనవసరంగా లేనిపోని పుకార్లు పుట్టించి అభిమానులను పార్టీ కార్యకర్తలను బాధ పెట్టొద్దు అని విజయ్ కాంత్ అనుచరులు కోరారు. నిజానికి ఈ నెల 19న విజయ్‌ కాంత్‌ అస్వస్థతకు గురైనప్పటి నుండి ఆయన ఆరోగ్యం పై చాల రూమర్స్ వినిపించాయి.

ఆయన ఊపిరాడని సమస్యతో బాధ పడుతున్నారని, ఇలాగే ఆయన ఆరోగ్యం కొనసాగితే.. భవిష్యత్తులో కష్టం అవుతుందని ఇలా రకరకాలుగా రూమర్స్ ను క్రియేట్ చేశారు. దీంతో కుటుంబ సభ్యులు కూడా ఆ వార్తలు విని కలత చెందారు. ఏది ఏమైనా విజయ్‌ కాంత్‌ ఆరోగ్యంతో తిరిగి రావడంతో, ఆయన అభిమానులు ఆయన పార్టీ కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు.

ఇక కెప్టెన్‌ గా తమిళ ప్రజలలో ప్రత్యేక అభిమానాన్ని సంపాదించుకున్న విజయ్ కాంత్‌, కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతూ పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు. తమిళనాడులో మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా ఆయన పార్టీ పెద్దగా ప్రభావం చూపించకపోవడానికి ప్రధాన కారణం.. విజయ్ కాంత్ అనారోగ్యమే. అందుకే ఆయన ఎన్నికల సమయంలోనూ ఏమీ మాట్లాడకుండా కారులోనే కూర్చుండి కేవలం సైగలతో మాత్రమే ప్రచారం చేశారు. రెండేళ్ల క్రితం విజయకాంత్‌ సింగపూరులో చికిత్స చేయించినా, ఆయన పూర్తిగా కోలుకోలేదు.