
డీఎండీకే అధ్యక్షుడు, నటుడు విజయకాంత్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. విజయ్ కాంత్ కోలుకొని ఇంటికి చేరుకున్నారని పార్టీ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఆయన క్షేమంగా ఉన్నారని, అనవసరంగా ఆయన ఆరోగ్యం గురించి లేనిపోని పుకార్లు సృష్టించవద్దని అభ్యర్థించారు. కాగా ఈనెల 19న విజయ్ కాంత్ అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. బుధవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఆయనకు అకస్మాత్తుగా ఊపరాడని సమస్య మొదలైంది. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను చెన్నై మనప్పాక్కంలోని ప్రైవేటు ఆసుప్రత్రిలో చేర్చారు.