https://oktelugu.com/

Vijay Deverakonda Kushi: పవన్ కళ్యాణ్ ‘ఖుషి’ కి రీమేక్ గా విజయదేవరకొండ ‘ఖుషి’..? స్టోరీ మొత్తం కాపీ కొట్టేశారా!

రీసెంట్ గానే ఈ చిత్రం రీ రిలీజ్ అయ్యి సుమారుగా 8 కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసింది.అలాంటి చరిత్ర ఉన్న సినిమా పేరు పెట్టుకున్నందుకు, మూవీ టీం మొత్తం చాలా జాగ్రత్తగా, ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ సినిమా చేస్తున్నారట.ఎందుకంటే ఈ సినిమా డిజాస్టర్ అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బంగారం లాంటి క్లాసిక్ సినిమా పేరు ని చెడగొట్టారంటూ మూవీ టీం ని సోషల్ మీడియా లో ఏకిపారేస్తారు.

Written By: , Updated On : April 27, 2023 / 05:47 PM IST
Follow us on

Vijay Deverakonda Kushi: ‘లైగర్’ వంటి డిజాస్టర్ ఫ్లాప్ సినిమా తర్వాత హీరో విజయ్ దేవరకొండ చేస్తున్న చిత్రం ‘ఖుషి’. నిన్ను కోరి ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ‘ఖుషి’ అనే పేరు కి ఒక చరిత్ర ఉంది, అప్పట్లో పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలవడమే కాకుండా, ఆయన కెరీర్ లో క్లాసిక్ గా కూడా నిలిచిపోయింది.

అంతే కాదు రీసెంట్ గానే ఈ చిత్రం రీ రిలీజ్ అయ్యి సుమారుగా 8 కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసింది.అలాంటి చరిత్ర ఉన్న సినిమా పేరు పెట్టుకున్నందుకు, మూవీ టీం మొత్తం చాలా జాగ్రత్తగా, ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ సినిమా చేస్తున్నారట.ఎందుకంటే ఈ సినిమా డిజాస్టర్ అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బంగారం లాంటి క్లాసిక్ సినిమా పేరు ని చెడగొట్టారంటూ మూవీ టీం ని సోషల్ మీడియా లో ఏకిపారేస్తారు.

అయితే లేటెస్ట్ వినిపిస్తున్న వార్త ఏమిటంటే, ఈ సినిమా టైటిల్ ని మాత్రమే కాదు, స్టోరీ లైన్ కూడా పవన్ కళ్యాణ్ ‘ఖుషి’ చిత్రం నుండే తీసుకున్నారట.ఈ సినిమా కూడా పాత సినిమాలాగానే ఈగో ని ప్రధాన అంశం గా తీసుకొని తెరకెక్కిస్తున్నారట, ప్రాణంగా ప్రేమించుకున్న ఇద్దరి ప్రేమికుల మధ్య ఈగో కారణంగా విడిపోతారు. ఆ తర్వాత చివరికి ఎలా కలిశారు అనేదే స్టోరీ.

ఒకే స్టోరీ లైన్ మీద వందల కొద్దీ సినిమాలు రావడం, అవి సక్సెస్ అవ్వడం మన టాలీవుడ్ లో కొత్తేమి కాదు, ఈ చిత్రాన్ని కూడా డైరెక్టర్ శివ నిర్వాణ అలాగే తెరకెక్కిస్తున్నాడట.సమంత అనారోగ్యం కారణం ఇన్ని రోజులు షూటింగ్ ఆగిపోయింది.ఇప్పుడు ఆమె కోలుకోవడం తో షూటింగ్ మళ్ళీ తిరిగి ప్రారంభం అయ్యింది, శరవేగంగా పూర్తి చేసి ఈ ఏడాది సెప్టెంబర్ 1 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల అవ్వబోతుందని ఇది వరకే మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.