Sai Dharam Tej: సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష చిత్ర ప్రమోషన్స్ లో తనకు జరిగిన బైక్ ప్రమాదం మీద స్పందించారు. అప్పటి చేదు అనుభవాలను గుర్తు చేసుకున్నారు. అదే సమయంలో తనను కాపాడి, సకాలంలో ఆసుపత్రికి చేర్చిన సయ్యద్ అబ్దుల్ ఫర్జాన్ గురించి మాట్లాడారు. అతని కలిశాను. మాట్లాడాను. డబ్బులు పరంగా ఏమీ ఇవ్వలేదు. తనకు ఎలాంటి అవసరం వచ్చినా, సహాయం కావాలన్నా కలవాలని ఫోన్ నెంబర్ ఇచ్చాను. ఎప్పుడైనా మొహమాటం లేకుండా ఫోన్ చేయవచ్చని చెప్పాను. అతనికి ఒక లక్ష ఇచ్చి చేతులు దులుపుకోవడం నాకు ఇష్టం లేదు. అందుకే నా ఫోన్ నెంబర్ ఇచ్చాను… అని చెప్పారు.
సాయి ధరమ్ తేజ్ స్టేట్మెంట్ నేపథ్యంలో సయ్యద్ అబ్దుల్ ని కొన్ని మీడియా సంస్థలు కలిశాయి. సాయి ధరమ్ తేజ్ మాటలకు పూర్తి భిన్నంగా సయ్యద్ అహ్మద్ వాదన ఉంది. నన్ను సాయి ధరమ్ తేజ్ కలవలేదు. నాకు ఆయన డబ్బులు ఇవ్వలేదు. ఆయన ఫోన్ నెంబర్ నా దగ్గర లేదు. గతంలో ఆయన కుటుంబ సభ్యులు నాకు డబ్బులు ఇచ్చారని ప్రచారం జరిగింది. దాని వలన అనేక సమస్యలు ఎదుర్కొన్నాను.
కొలీగ్స్ జాక్ పాట్ కొట్టావంటూ వేధింపులకు గురి చేశారు. దాంతో సి ఎం ఆర్ షాపింగ్ మాల్ లో ఉద్యోగం మానేశాను. నాలుగు నెలలు జాబ్ లేక ఇబ్బందిపడ్డాను. బంధువులు కూడా ఫోన్లు చేసి నీకు లక్షల రూపాయలు ఇచ్చారట కదా అని అడిగేవారు. అలాంటిదేమీ లేదని చెప్పినా నమ్మేవారు కాదు. ఇంక్వైరి పేరుతో పోలీసులు, మీడియా పలుమార్లు ఫోన్లు చేశారు. నాకు సాయి ధరమ్ కానీ, ఆయన ఫ్యామిలీ కానీ రూపాయి ఇవ్వలేదని సయ్యద్ అబ్దుల్ చెప్పాడు.
ఈ క్రమంలో సాయి ధరమ్ తేజ్ ని కొందరు ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. దీంతో ఆయన నేరుగా స్పందించారు. ట్విట్టర్ లో వివరణ ఇచ్చారు. నేను, నా ఫ్యామిలీ మెంబర్స్ సయ్యద్ అహ్మద్ కి డబ్బులు ఇచ్చినట్లు ఎక్కడా చెప్పలేదు. ఫోన్ నంబర్ ఇచ్చి సహాయం కావాలంటే అడగాలని మాత్రమే చెప్పాను. ఇంటర్వ్యూలో కూడా నేను అదే చెప్పాను. జరిగిన విషయం ఇది. ఇకపై నేను దీనిపై మాట్లాడాలనుకోవడం లేదని లెటర్ విడుదల చేశారు.
To whomsoever it may concern..
Thank You
Sai Dharam Tej. pic.twitter.com/qJr3SYYJ6B
— Sai Dharam Tej (@IamSaiDharamTej) April 27, 2023