Samyuktha Menon: ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లో ఎక్కడ చూసిన సాయి ధరమ్ తేజ్ హీరో గా నటించిన ‘విరూపాక్ష’ చిత్రం గురించే చర్చ నడుస్తుంది.ఇటీవలే విడుదలైన ఈ సినిమా మొదటి రోజు మొదటి ఆట నుండే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. సమ్మర్ లో సరైన బ్లాక్ బస్టర్ కోసం ఎదురు చూస్తున్న బయ్యర్స్ కి జాక్పాట్ లాగ తగిలింది ఈ సినిమా.
ట్రేడ్ పండితుల సమాచారం ప్రకారం ఈ చిత్రం మొదటి వారం లోనే 32 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను సాధించిందని చెప్తున్నారు.ఇది ఒక మీడియం రేంజ్ హీరో కి అద్భుతమైన వసూళ్లు అని చెప్పొచ్చు. ఈ చిత్రం ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ దాదాపుగా 24 కోట్ల రూపాయలకు జరిగింది.ఈ బ్రేక్ ఈవెన్ మార్కుని ఈ సినిమా కేవలం నాలుగు రోజుల్లోనే దాటేసి అందరినీ ఆశ్చర్యపొయ్యేలా చేసింది.
ఇది ఇలా ఉండగా ఈమధ్యనే ఈ సినిమా ఆడుతున్న థియేటర్స్ లోకి డైరెక్టర్, హీరోయిన్ , హీరో తో పాటుగా నిర్మాత కూడా వచ్చి అభిమానులతో కాసేపు ముచ్చటించి వెళ్తున్నారు.అయితే హైదరాబాద్ లోని ఒక థియేటర్ లో వెళ్ళినప్పుడు డైరెక్టర్ కార్తీక్ దండు ఫోన్ పోయిండట.ఈ విషయాన్నీ తెలుసుకున్న హీరోయిన్ సంయుక్త మీనన్ డైరెక్టర్ కి ఐ ఫోన్ ప్రో మొబైల్ నీవు కొనిచ్చింది అట.
ఆమె మాట్లాడుతూ ‘డైరెక్టర్ గారి ఫోన్ థియేటర్ లో పోయిందని విన్నాను, నేను ఎలాగో అతనికి గిఫ్ట్ ఇద్దామని అనుకుంటూ ఉన్నాను, సరిగ్గా అదే సమయం లో ఆయన ఫోన్ పోయిందని తెలిసింది, సినిమాకి వస్తున్న రెస్పాన్స్ ని సోషల్ మీడియా లో చూడడానికి ఆయన వేరే వాళ్ళ ఫోన్ వాడుతున్నదని తెలిసింది, ఈ సమయం లో ఆయనకీ ఇదే సరైన బహుమతి అనిపించి వెంటనే ఐ ఫోన్ కొనిచ్చాను’ అంటూ చెప్పుకొచ్చాయండి సంయుక్త మీనన్.