https://oktelugu.com/

‘రింగు’లోకి వస్తున్న విజయ్ దేవరకొండ..!

దర్శకుడు పూరి జగన్మాథ్ హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్లో ‘ఫైటర్’ మూవీ రాబోతుంది. ఈ మూవీ షూటింగు ముంబైలో శరవేగంగా జరుగుతున్న సమయంలోనే  కరోనాతో సినిమా వాయిదా వేయాల్సి వచ్చింది. అయితే విశ్వసనీయ సమాచారం మేరకు ఈ మూవీ షూటింగు హైదరాబాద్లో అక్టోబర్ 10 నుంచి ప్రారంభం కానుందట. Also Read: మెగా హీరో మూవీకి భారీ ఆఫర్.. డీల్ కుదిరినట్టేనా? కరోనా నిబంధనలు పాటిస్తూనే సినిమాను ప్రారంభించేందుకు దర్శకుడు పూరి ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. దీనిలో […]

Written By: , Updated On : September 20, 2020 / 04:10 PM IST
Follow us on

దర్శకుడు పూరి జగన్మాథ్ హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్లో ‘ఫైటర్’ మూవీ రాబోతుంది. ఈ మూవీ షూటింగు ముంబైలో శరవేగంగా జరుగుతున్న సమయంలోనే  కరోనాతో సినిమా వాయిదా వేయాల్సి వచ్చింది. అయితే విశ్వసనీయ సమాచారం మేరకు ఈ మూవీ షూటింగు హైదరాబాద్లో అక్టోబర్ 10 నుంచి ప్రారంభం కానుందట.

Also Read: మెగా హీరో మూవీకి భారీ ఆఫర్.. డీల్ కుదిరినట్టేనా?

కరోనా నిబంధనలు పాటిస్తూనే సినిమాను ప్రారంభించేందుకు దర్శకుడు పూరి ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగానే ప్రత్యేకంగా ఓ బాక్సింగ్ సెట్ వేయించినట్లు తెలుస్తోంది. ఈ సెట్స్ లోనే ఫైట్ చిత్రీకరించేందుకు చిత్రయూనిట్ సన్నహాలు చేస్తోంది. దీంతో విజయ్ దేవరకొండ షూటింగు ప్రారంభం కానున్న రోజే బాక్సింగ్ రింగులోకి దిగాల్సి ఉంటుందట.ఇటీవలే పూరి జగన్నాథ్ ‘ఇస్మార్ట్ శంకర్’తో బ్లాక్ బస్టర్ హిట్టుందుకున్నాడు. అయితే విజయ్ దేవరకొండ గత చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’ మాత్రం డిజాస్టర్ గా మిగిలింది. ‘ఫైటర్’ మూవీని హిందీలో బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహర్ నిర్మిస్తుండగా తెలుగులో పూరి జగన్మాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. విజయ్ దేవరకొండ ఈ మూవీలో డాన్ కొడుకుగా కన్పించబోతున్నాడు.

Also Read: లాస్య రచ్చ పై గీతా మాధురి కౌంటర్ !

బాలీవుడ్లో తెరకెక్కిన ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్-2’లో అనన్యపాండే నటించి మంచి గుర్తింపు తెచ్చుకొంది. ఈ మూవీ తర్వాత విజయ్ దేవరకొండ సరసన నటించే ఛాన్స్ అనన్యపాండే దక్కించుకుంది. తన గ్లామర్ తో సినిమాకు హైప్ తీసుకురావడం ఖాయమనే టాక్ విన్పిస్తోంది. ఇక విజయ్ దేవరకొండ తొలిసారి ఓ పాన్ ఇండియా మూవీలో నటిస్తున్నాడు. ఈ ‘ఫైటర్’ మూవీ విజయ్ కు ఏమేరకు సక్సస్ అందిస్తుందో వేచిచూడాల్సిందే..!