ఊరికి చివరన ఓ వాగు. ఊళ్లో ఎవ్వరూ చనిపోయినా అక్కడే ఖననం చేస్తారు.. పక్కఊరు వెళ్లే వారందరూ ఈ వూరు నుంచే వెళ్లాలి. ఎవరైనా సాయంత్రం 6 దాటిందంటే వాగు దాటడానికి భయపడిపోతారు.. ఎన్నో ఏళ్లుగా ఆ ఊరి వాళ్లందరినీ అక్కడే దహనం చేయడంతో అదో దెయ్యాల వాగుగా మారిపోయింది. ఇసుకలో ఎక్కడ తవ్వినా మనుషుల ఎముకలే కనిపిస్తాయి.. కుక్కలు, నక్కలు పూడ్చిపెట్టిన శవాలను పీక్కుతినడం ఆ వాగులో ప్రత్యేకత.. ఇంతకీ ఆ గగొర్పుడే వాగు ఎక్కడుందంటే సిద్ధిపేట జిల్లాలోని మూరుమూల నకిరికొమ్ముల గ్రామం శివారులో..
Also Read: రాజ్యసభలో రణరంగం.. వ్యవసాయ బిల్లులకు ఆమోదం
ఈ గ్రామ రైతులు రాత్రి పూట తమ పొలాలకు నీరు పెట్టడానికి వాగు ఒడ్డుకు వెళితే కోరిక తీరని చాలా ఆత్మలు కనిపిస్తాయట.. దెయ్యాలుగా భయపెడతాయట.. మంటలను రాజేస్తాయట.. ఇక్కడ వారందరూ దెయ్యాలను ‘కామునుభూతాలు’ అని పిలుస్తారు.. వాగు ఒడ్డున ఉన్న మర్రిచెట్టే దెయ్యాల అడ్డాగా చెబుతారు..
చాలా మంది పక్కఊరి వారు.. ఆ గ్రామస్థులు కూడా వాగులో దెయ్యాలను గమనించామని.. అక్కడ రాత్రిళ్లు ఏదో అలజడి ఉంటుందని చెబుతుంటారు.. ఇది వాస్తవమో కాదో కానీ ఎవ్వరూ కూడా ఈ దెయ్యాల అంతు చూడడానికి ప్రయత్నించిన పాపాన పోలేదు. అంతేకాదు.. ఈ వాగుపక్కన వందల సంఖ్యలో తాటి, ఈత చెట్లు ఉన్నాయట.. రాత్రంతా ఫుల్లుగా నిండి ఉండే కల్లు కుండలను ఈ దెయ్యాలే తాగిస్తున్నాయని గౌడ కులస్థులు ఆరోపిస్తున్నారు. కల్లు తాగిన దెయ్యాలు రాత్రుళ్లు భరతనాట్యం చేస్తున్నాయంటున్నారు.
Also Read: ఇక రైలులో ఆ దేశం వెళ్లొచ్చు..
ఆధునికంగా ఎంతో ఉన్నతంగా మనిషి సాగిపోతున్నా కూడా ఇంకా దెయ్యాలున్నాయా వట్టి ట్రాష్ అనే వారు ఎందరో.. కానీ ఆ గ్రామస్థులు మాత్రం ఇప్పటికీ ఈ దెయ్యాల వాగు పక్కకు వెళ్లాలంటేనే పక్కతడుపుకుంటారట.. అలా దెయ్యాల వాగు మిస్టరీ ఇంకా అక్కడ స్థానికులను భయపెడుతూనే ఉంది.