
Varasudu OTT Release Date: విజయ్ సంక్రాంతి చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమైంది. వారసుడు డిజిటల్ పార్టనర్స్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. వంశీ పైడిపల్లి దర్శకుడిగా తెరకెక్కింది వారసుడు.తమిళ్ లో విడుదల వారిసు టైటిల్ తో విడుదల చేశారు. సంక్రాంతి కానుకగా విడుదల చేశారు. తమిళ వెర్షన్ మూడు రోజుల ముందే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. అయితే విజయ్ మేనియాతో పాటు పండగ కలిసొచ్చింది. తమిళ వెర్షన్ వారిసు వసూళ్ల వర్షం కురిపించింది. వారిసు థియేటరికల్ రన్ ముగిసే నాటికి రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు అందుకుంది. ఈ మేరకు నిర్మాతలు పోస్టర్స్ విడుదల చేశారు.
తమిళ వెర్షన్ మిక్స్డ్ టాక్ తెచ్చుకోవడం వారసుడు చిత్రానికి మైనస్ అయ్యింది. దాని వలన ఓపెనింగ్స్ కోల్పోయింది. అయితే టోటల్ వసూళ్లు పర్లేదని ట్రేడ్ వర్గాల టాక్. ఈ చిత్రానికి విజయ్ వంద కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకున్నాడని కథనాలు వెలువడ్డాయి. వారసుడు మూవీలో రష్మిక మందాన హీరోయిన్ గా నటించారు. అయితే ఆమె పాత్రకు ఏమాత్రం ప్రాధాన్యత లేదు. శరత్ కుమార్, జయసుధ, శ్రీకాంత్ వంటి భారీ తారాగణం నటించారు.

కాగా వారసుడు డిజిటల్ రైట్స్ అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. ఈ క్రమంలో అధికారిక స్ట్రీమింగ్ డేట్ విడుదల చేశారు. ఫిబ్రవరి 22 నుంచి వారసుడు తెలుగు, తమిళ భాషల్లో స్టీమ్ కానుంది. ప్రైమ్ అధికారిక ప్రకటనతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. థియేటర్స్ లో మూవీ చూడని వాళ్ళు, మళ్ళీ ఒకసారి చూడాలనుకుంటున్నవాళ్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా నాలుగు వారాలకే ఏ సినిమా అయినా ఓటీటీలోకి వచ్చేస్తుంది. వారసుడు మాత్రం ఐదు వారాల సమయం తీసుకుంది.
మిగతా హీరోలతో పోల్చితే విజయ్ స్పీడ్ గా సినిమాలు విడుదల చేస్తున్నారు. వారసుడు విడుదలైన రోజుల వ్యవధిలో లోకేష్ కనకరాజ్ మూవీ సెట్స్ పైకి తీసుకెళ్లారు. విజయ్ 67వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి లియో: బ్లడీ స్వీట్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. టైటిల్ ప్రోమో దుమ్మురేపింది. అప్పుడే విడుదల తేదీ కూడా ప్రకటించడం విశేషం. 2023 అక్టోబర్ 19న విడుదల చేస్తున్నారు. త్రిషా హీరోయిన్ గా నటిస్తున్నారు. లోకేష్ కనకరాజ్ సినిమాటిక్ యూనివర్స్ లో మూడో చిత్రంగా లియో రూపొందుతుంది. ఖైదీ, విక్రమ్ చిత్రాలతో దీనికి లింక్ ఉంటుంది. ఆ రెండు భారీ విజయాలు నమోదు చేసిన విషయం తెలిసిందే.
Get ready to experience this captivating story laced with emotional turmoil!#VarisuOnPrime, Feb 22 only on @PrimeVideoIN in Tamil, Telugu and Malayalam.#Thalapathy @actorvijay sir @directorvamshi @iamRashmika @MusicThaman @7screenstudio @TSeries #Varisu #Vaarasudu #Vamshajan pic.twitter.com/Rry3P3KJYY
— Sri Venkateswara Creations (@SVC_official) February 17, 2023