
Uttar Pradesh: విమర్శించడం వేరు, తప్పులు ఎత్తిచూపడం వేరు, కానీ అదే పనిగా తిట్టడం వేరు.. అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీని ప్రతిపక్షాలు చేస్తున్నవి అవే.. అందుకే మోడీ అంతకంతకు బలపడుతున్నాడు.. ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదిగి పోతున్నాడు. ఇండియా టుడే సర్వే ప్రకారం అద్భుతం జరిగితే తప్ప మోడీ ఓడిపోవడం అసాధ్యం అనేది తేలిపోయింది. మోడీకి వ్యతిరేకంగా వార్తలు ప్రచురించే ఇండియా టుడే కూడా ఇలాంటి సర్వే చేసింది అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటప్పుడైనా కూడా ప్రతిపక్షాలు కొంచెం సోయి లోకి వస్తే బాగుంటుంది కదా. కానీ అలా జరగడం లేదు. పైగా ఎంతో కొంత సామాజిక బాధ్యత ఉన్న కొంతమంది నెటిజన్లు కూడా కట్టు తప్పుతున్నారు. ప్రతి దానికి బిజెపితో ముడి వేస్తున్నారు. దీనివల్ల అసలు విషయం పక్కకు పోయి కొత్త వివాదం చెలరేగుతున్నది.
ఉత్తర ప్రదేశ్ లో కొడుకు భార్యపై ఓ తండ్రి కన్నేశాడు. కొడుకులేని సమయం చూసుకొని ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. కన్నతండ్రి లా ఉండాల్సిన మామ తనపై అత్యాచారం చేయడంతో ఆ కోడలు సహించలేకపోయింది. భర్తకు చెబితే పరువు పోవుతుందన్న భయంతో అతడు వెనుకడుగు చేశాడు. దీంతో ఆ బాధితురాలు ధైర్యం చేసి పోలీసు స్టేషన్ మెట్టు ఎక్కింది. పోలీసులకు తన మామ పై ఫిర్యాదు చేసింది. ఇందుకు సంబంధించిన ఆధారాలు సమర్పించింది. ఇప్పుడు అసలే సోషల్ మీడియా రోజులు కాబట్టి కొంతమంది దీనిని వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. ఇంకేముంది దీనిని ఒక్కో మీడియా ఒక్కో తీరుగా టెలికాస్ట్ చేసింది. ఇది జరిగిన సంఘటన.

కానీ బిజెపి అంటే అంత ఎత్తున ఎగిరిపడే సమాజ్వాది పార్టీ, బహుజన్ సమాజ్వాది పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఆందోళనలు చేశాయి. యోగి హయాంలో మహిళలకు రక్షణ లేదంటూ నానా యాగి చేశాయి. వాటి తీరు అంతే కాబట్టి ఎవడూ ఏం చేయలేడు. ప్రతిపక్షాలు తమ ఫోల్డ్ దాటి పనిచేయడం లేదు కాబట్టే కదా ఉత్తరప్రదేశ్ ప్రజలు కీలు ఎరిగి వాత పెట్టింది. యోగి సర్కార్ కు మళ్లీ అధికారం కట్టబెట్టింది.. కానీ ఇదే సమయంలో బాధ్యతగా ఉండాల్సిన పౌర సమాజం కూడా ప్రతిపక్షాల్లాగే మాట్లాడటం ఇక్కడ మరింత విషాదం.. మామ కోడలిపై అత్యాచారం చేస్తే దానిని బిజెపికి అంటగట్టడం, బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వావి వరుసలు లేకుండా పాపాలు పెరిగి పోయాయని వ్యాఖ్యానించడం బుద్ధిలేనితనానికి నిదర్శనం.