Vijay Upcoming Film: మీడియం రేంజ్ హీరోలలో స్టార్ హీరో అయ్యేంత కెపాసిటీ ఉన్న హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda). కెరీర్ ప్రారంభం లో వచ్చిన భారీ హిట్స్, తద్వారా వచ్చిన క్రేజ్, ఫాలోయింగ్ ని కరెక్ట్ గా ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్లుంటే ఈ హీరో ఈపాటికి స్టార్ హీరోల జాబితాలో ఉండేవాడు. కానీ సరైన స్క్రిప్ట్ సెలక్షన్ లేకపోవడం వల్ల వరుస డిజాస్టర్స్ ని అందుకుంటూ కెరీర్ ని రిస్క్ లో పడేసుకున్నాడు. రీసెంట్ గా ఆయన నుండి ‘కింగ్డమ్'(Kingdom Movie) అనే చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలైంది. కానీ మొదటి ఆట నుండే డివైడ్ టాక్ రావడం తో ఈ చిత్రం కూడా కమర్షియల్ గా ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. ఇప్పుడు విజయ్ దేవరకొండ స్టార్ అయ్యే సంగతి కాసేపు పక్కన పెడితే, ఆయన కెరీర్ ముందుకు సాగడం కోసం అర్జెంటు గా ఒక భారీ బ్లాక్ బస్టర్ హిట్ కావాలి.
Also Read: ఆ స్టార్ హీరో కి ఉన్నట్టు నాకు బ్యాక్ గ్రౌండ్ సపోర్ట్ లేదు..అందుకే ఫ్లాపులు – విజయ్ దేవరకొండ
ప్రస్తుతానికి ‘శ్యామ్ సింగ రాయ్’ ఫేమ్ రాహుల్ సాంకృత్యాన్ తో ఒక పీరియడ్ సినిమా చేస్తున్న విజయ్ దేవరకొండ, ఈ సినిమా పూర్తి అవ్వగానే దిల్ రాజు నిర్మాణం లో తెరకెక్కే ‘రౌడీ జనార్దన్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం తర్వాత ఆయన అదే దిల్ రాజు(Dil Raju) నిర్మాణం లో డైరెక్టర్ హరీష్ శంకర్(Harish Shankar) తో మరో సినిమా చేయడానికి సిద్దమయ్యాడట. ప్రస్తుతం హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ తో ‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh) చిత్రం చేస్తున్నాడు. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా పూర్తి అయిన వెంటనే ఆయన విజయ్ దేవరకొండ తో చేయబోయే స్క్రిప్ట్ మీద పని చేస్తాడట. హరీష్ శంకర్ మినిమం గ్యారంటీ కమర్షియల్ డైరెక్టర్. కెరీర్ లో రామయ్య వస్తావయ్యా, షాక్ మరియు మిస్టర్ బచ్చన్ సినిమాలు తప్ప, మిగిలినవన్నీ సూపర్ హిట్స్ గా నిలిచాయి.
Also Read: విజయ్ దేవరకొండ పై కేసు నమోదు.. క్షమాపణలు వృధా అయ్యినట్టేనా!
డైరెక్ట్ సినిమాలకంటే రీమేక్ సినిమాలు చేయడం లో హరీష్ శంకర్ కి మంచి పట్టు ఉంది. ఇప్పుడు విజయ్ దేవరకొండ తో ఆయన చేయబొయ్యే సినిమా కూడా రీమేక్ నా?, లేకపోతే డైరెక్ట్ సినిమానా అనేది తెలియాల్సి ఉంది. అయితే విజయ్ దేవరకొండ అభిమానుల్లో చిన్న భయం మొదలైంది. ప్రస్తుతం తెలుగు ఆడియన్స్ కమర్షియల్ సినిమాలను పెద్దగా ఆదరించడం లేదు. కేవలం కంటెంట్ ఉన్న భారీ బడ్జెట్ సినిమాలను మాత్రమే ఆదరిస్తున్నారు. ఇలాంటి సమయం లో విజయ్ దేవరకొండ హరీష్ శంకర్ లాంటి కమర్షియల్ డైరెక్టర్ తో సినిమా చేస్తే ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు అనే భయం ఏర్పడింది. పొరపాటున ఈ సినిమా ఫ్లాప్ అయితే విజయ్ దేవరకొండ కెరీర్ ఖతం అయ్యే ప్రమాదం కూడా ఉంది. చూడాలి మరి, ఆయన ఎలా మ్యానేజ్ చేసుకుంటాడు అనేది.