Su From So Movie: ఈ ఏడాది ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద అత్యధిక శాతం సక్సెస్ రేషియో ని సొంతం చేసుకున్న సినిమాల లిస్ట్ తీస్తే మొత్తం చిన్న సినిమాలే కనిపిస్తాయి. స్టార్ హీరోల సినిమాలు అత్యధిక శాతం చతికిల పడ్డాయి. కానీ కంటెంట్ ఉన్న చిన్న సినిమాలు మాత్రం స్టార్ హీరోల సినిమాల రేంజ్ లో వసూళ్లను రాబట్టాయి, నెలల తరబడి థియేటర్స్ లో రన్ అయ్యాయి, ఇప్పటికీ రన్ అవుతూనే ఉన్నాయి. అలా చిన్న సినిమాగా విడుదలై బాక్స్ ఆఫీస్ భారీ వసూళ్లను సాధించిన సినిమాల్లో ఒకటి ‘సు ఫ్రొం సో'(Su From So) అనే చిత్రం. రీసెంట్ గానే కన్నడలో విడుదలైన ఈ సినిమా మొదటి ఆట నుండే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని సొంతం చేసుకొని బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. నిన్ననే ఈ చిత్రం తెలుగు వెర్షన్ కూడా థియేటర్స్ లో విడుదలైంది.
Also Read:విమానాశ్రయంలోకి వెళ్లకుండా అల్లు అర్జున్ ని అడ్డుకున్న సిబ్బంది..వీడియో వైరల్!
మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని తెలుగు లో గ్రాండ్ రిలీజ్ చేశారు. ఇక్కడ కూడా రెస్పాన్స్ అదిరిపోయింది. అయితే ఈ చిత్రం కన్నడ వెర్షన్ ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 60 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిందట. కేవలం 5 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ చిత్రం ఈ రేంజ్ వసూళ్లను రాబట్టి నిర్మాతలకు ఏ రేంజ్ లాభాలను తెచ్చిపెట్టిందో మీరే చూడండి. ఈ చిత్రానికి దుమినాద్ దర్శకత్వం వహించాడు. ‘మహావతార్ నరసింహా’ తో పాటు ఈ సినిమా కూడా జులై 25 న ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదలైంది. రెండు సినిమాలకు సూపర్ హిట్స్ వచ్చాయి, దీంతో కన్నడ బాక్స్ ఆఫీస్ కళకళలాడుతుంది. ఈ చిత్రాన్ని హారర్ కామెడీ జానర్ లో తెరకెక్కించారు. సినిమా విడుదలకు ముందు మూవీ టీం పెద్దగా ప్రోమోషన్స్ చేయలేదు. దీంతో ఓపెనింగ్ వసూళ్లు లక్షల్లోనే వచ్చింది. అలాంటి చిత్రం నేడు వంద కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టే దిశగా అడుగులు వేస్తుంది.
Also Read: అంచనాలను అందుకోలేకపోయిన ‘అతడు’ రీ రిలీజ్..మొదటిరోజు గ్రాస్ ఇంత తక్కువనా?
మంచి కంటెంట్ ఉంటే నెత్తిన పెట్టుకొని ఆదరించే మన తెలుగు ఆడియన్స్ కూడా ఈ చిత్రాన్ని ప్రోత్సహిస్తే , కచ్చితంగా రాబోయే రోజుల్లో వంద కోట్ల గ్రాస్ వసూళ్లను రాబడుతుందని అంటున్నారు. ఈ వీకెండ్ కుటుంబం తో కలిసి థియేటర్ కి వెళ్లి కడుపుబ్బా నవ్వుకోగలిగే సినిమా, కచ్చితంగా మిస్ కాకుండా చూడండి. ప్రకాష్ తుమినాద్, సంధ్య, దీపక్ రాయ్ తదితరులు ఈ చిత్రం లో నటించారు. పేరున్న నటీనటులు ఒక్కరు కూడా లేరు. అయినప్పటికీ ఈ సినిమాకు ఆడియన్స్ ఈ రేంజ్ గ్రాస్ ఇస్తున్నారంటే, కంటెంట్ ఉన్న సినిమాలు వాళ్ళు ఎలా ఆదరిస్తారో అర్థం చేసుకోవాలి.