Box Office Records: ఈ ఏడాది కంటెంట్ ఉన్న సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టిస్తున్న వసూళ్ల సునామీ కి లిమిట్ అనేది లేకుండా పోయింది. ముఖ్యంగా దైవ భక్తి ఉన్న సినిమాలను సరిగ్గా తీస్తే కలెక్షన్స్ ఎక్కడ మొదలు అవుతుందో , ఎక్కడ ఆగుతుందో ఎవ్వరూ అంచనా వెయ్యలేరు, ఆ రేంజ్ లో వసూళ్లు వస్తున్నాయి. రీసెంట్ గా విడుదలైన ‘మహావతార్ నరసింహా'(Mahavatar Narasimha) చిత్రం అందుకు ఒక ఉదాహరణ. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ యానిమేషన్ చిత్రానికి మొదటి ఆట నుండే అద్భుతమైన పాజిటివ్ టాక్ వచ్చింది. ఆ టాక్ కి తగ్గట్టుగానే వసూళ్ల సునామీ కురుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు ఈ సినిమాకు అన్ని ప్రాంతీయ భాషలకు కలిపి 175 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. సినిమా విడుదలై నేటికి సరిగ్గా 17 రోజులు అయ్యింది. 17 వ రోజున ఈ చిత్రం త్వరలో విడుదల అవ్వబోయే ‘కూలీ'(Coolie Movie),’వార్ 2′(War 2 Movie) లను కూడా డామినేట్ చేస్తుంది.
Also Read: పవన్ కళ్యాణ్ డైరెక్టర్ తో విజయ్ దేవరకొండ..ఈసారైనా కాలం కలిసొచ్చేనా?
బుక్ మై షో(Book My Show) యాప్ లో ఈ చిత్రానికి గంటకు 42 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోతున్నాయి. ఇండియా మొత్తం ఎదురు చూస్తున్న ‘కూలీ’ చిత్రానికి గంటకు 17 వేల టిక్కెట్లు అమ్ముడుపోతుండగా, ‘వార్ 2’ చిత్రానికి గంటకు రెండు వేల టికెట్స్ అమ్ముడుపోతున్నాయి. 17 వ రోజు కూడా ఒక యానిమేషన్ చిత్రం కొత్తగా విడుదలయ్యే రెండు క్రేజీ సినిమాలను కూడా డామినేట్ చేస్తుందంటే ఈ చిత్రానికి జనాలు ఎంతలా బ్రహ్మరథం పడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. ఆగష్టు 14 న విడుదల అవ్వబోయే ఆ రెండు సినిమాలకు టాక్ ఒకవేళ అటు ఇటు అయితే, మళ్ళీ ‘మహావతార్ నరసింహా’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద తన డామినేషన్ ని కొనసాగించే అవకాశం ఉంటుంది. ఫుల్ రన్ లో మరో వంద కోట్ల గ్రాస్ వసూళ్లను అవలీలగా ఈ చిత్రం అందుకోవచ్చు.
Also Read: 5 కోట్లతో నిర్మించిన ఈ చిన్న సినిమా..ఎంత గ్రాస్ వసూళ్లను రాబట్టిందో తెలుసా?
తెలుగు లో ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్(Allu Aravind) విడుదల చేసిన సంగతి తెలిసిందే. తెలుగు లో ఇప్పటి వరకు ఈ చిత్రానికి పాతిక కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. రీసెంట్ గా విడుదలైన కొన్ని క్రేజీ చిత్రాలను కూడా ఈ యానిమేషన్ చిత్రం డామినేట్ చేసింది. మన ఇండియా లో ఇప్పటి వరకు కొన్ని యానిమేటెడ్ సినిమాలు తెరకెక్కాయి కానీ, ఒక్క చిత్రానికి కూడా ఈ రేంజ్ భారీ వసూళ్లు సొంతం కాలేదు. 200 కోట్ల గ్రాస్ మార్కుకి అతి చేరువలో ఉన్న ఈ సినిమా, ఇంకా ఎంత దూరం వెళ్తుందో చూడాలి.