https://oktelugu.com/

Maharaja Movie Collections: చైనా లో అంచనాలను అందుకోలేకపోయిన విజయ్ సేతుపతి ‘మహారాజ’ చిత్రం..10 రోజుల్లో ఎంత వసూళ్లు వచ్చాయంటే!

నిధిలన్ స్వామినాథన్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి, వంద కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. థియేటర్స్ లో ఈ చిత్రం ఎంత పెద్ద హిట్ అయ్యిందో, ఓటీటీ లో అంతకు మించి పెద్ద హిట్ అయ్యింది. సుమారుగా 6 నెలలకు పైగా ఈ చిత్రం నాన్ స్టాప్ గా ట్రెండ్ అయ్యింది.

Written By:
  • Vicky
  • , Updated On : December 9, 2024 / 10:03 PM IST

    Maharaja Movie Collections

    Follow us on

    Maharaja Movie Collections: సౌత్ ఇండియా లో తన విలక్షణమైన నటనతో హీరో గా, క్యారక్టర్ ఆర్టిస్టుగా, విలన్ గా ప్రేక్షకులను మెప్పిస్తూ, యూత్ ఆడియన్స్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజి ని ఏర్పాటు చేసుకున్న హీరో విజయ్ సేతుపతి. ఈయన తనలోని కోణాలన్నీ బయటపెట్టేసాడు. హీరోగా అద్భుతమైన కెరీర్ ని ఎంజాయ్ చేసే ఈయన, మధ్యలో విలన్ గా నాలుగు చిత్రాల్లో నటించి, తాను ఏ రోల్ లో అయినా జీవించగలను అని నిరూపించుకున్నాడు. సాధారణంగా మంచి క్రేజ్ తో కొనసాగే హీరోలు ఇలాంటి రిస్క్ చేయరు. కానీ విజయ్ సేతుపతి ఆ రిస్క్ చేసి సక్సెస్ సాధించాడు. నేడు ఈయన సక్సెస్ అవ్వడం తో, అతని తోటి హీరోలు కూడా ఇలాంటి రిస్కులు చేయడానికి ముందుకు వస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే విజయ్ సేతుపతి తన 50 వ చిత్రం గా ‘మహారాజా’ అనే సినిమా చేసిన సంగతి అందరికీ తెలిసిందే.

    నిధిలన్ స్వామినాథన్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి, వంద కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. థియేటర్స్ లో ఈ చిత్రం ఎంత పెద్ద హిట్ అయ్యిందో, ఓటీటీ లో అంతకు మించి పెద్ద హిట్ అయ్యింది. సుమారుగా 6 నెలలకు పైగా ఈ చిత్రం నాన్ స్టాప్ గా ట్రెండ్ అయ్యింది. ఇది సాధారణమైన విషయం కాదు. ఇంతటి రెస్పాన్స్ వచ్చిన ఈ సినిమాని చైనా విడుదల చేయాలనీ మూవీ టీం పట్టుబట్టి చైనా భాషలో దబ్ చేసిన గత నెల 27 వ తారీఖున గ్రాండ్ గా చైనా లోని 40 వేలకు పైగా థియేటర్స్ లో విడుదలైంది. అక్కడ పాజిటివ్ రెస్పాన్స్ ని దక్కించుకున్న ఈ సినిమాకి ప్రీమియర్ షోస్ నుండి ఇండియన్ కరెన్సీ లెక్కల ప్రకారం 5 కోట్ల 75 లక్షల రూపాయిలు వచ్చాయి.

    అదే విధంగా రెండవ రోజు 9 కోట్ల 20 లక్షల రూపాయిలను రాబట్టిన ఈ సినిమా, మూడవ రోజు 7 కోట్ల 13 లక్షల రూపాయిలను రాబట్టింది. అలా ఓవరాల్ గా 26 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను మూడు రోజుల్లో రాబట్టిన ఈ సినిమా, పది రోజులకు 70 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. విడుదలకు ముందు ఈ చిత్రం ‘డంగల్’ రేంజ్ లో వందల కోట్ల రూపాయిల గ్రాస్ ని రాబడుతుందని బలంగా నమ్మింది మూవీ టీం. కానీ విడుదల తర్వాత కేవలం 70 కోట్ల రూపాయిల వరకే రాబట్టింది. సినిమా ఇంకా థియేటర్స్ లో నడుస్తుంది కాబట్టి వంద కోట్ల రూపాయిలు కూడా రావొచ్చు. కానీ అనుకున్న లక్ష్యాన్ని మాత్రం చేరుకోలేకపోయింది ఈ చిత్రం. వచ్చిన పాజిటివ్ టాక్ జనాల్లోకి పూర్తిగా వెళ్లలేదని మూవీ టీం అంచనా వేస్తుంది.