https://oktelugu.com/

Vijay Sethupathi: అక్షరాలా 40 వేల థియేటర్స్ లో ప్రభంజనం సృష్టించబోతున్న విజయ్ సేతుపతి లేటెస్ట్ చిత్రం!

నెట్ ఫ్లిక్స్ లో తెలుగు, తమిళం, హిందీ మరియు ఇతర ప్రాంతీయ భాషల్లో విడుదలైన ఈ సినిమా, ఏకంగా 6 నెలలకు పైగా ట్రెండ్ అయ్యింది. #RRR తర్వాత నెట్ ఫ్లిక్స్ లో ఆ రేంజ్ లో ట్రెండ్ అయిన సినిమా ఇదే.

Written By:
  • Vicky
  • , Updated On : November 20, 2024 / 05:30 PM IST

    Vijay Sethupathi

    Follow us on

    Vijay Sethupathi: ఈ ఏడాది విజయ్ సేతుపతి హీరోగా నటించిన ‘మహారాజా’ చిత్రం ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. విజయ్ సేతుపతి 50 వ చిత్రంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ చిత్రాన్ని చేసాడు. గత కొంతకాలంగా విజయ్ సేతుపతి హీరో గా మాత్రమే కాకుండా , విలన్ గా కూడా చేస్తూ నెమ్మదిగా హీరో రోల్స్ కి దూరం అయ్యాడు. పేట, మాస్టర్, విక్రమ్, జవాన్, ఉప్పెన ఇలా వరుసగా ఆయన విలన్ క్యారెక్టర్స్ చేస్తూ వచ్చాడు. మధ్యలో హీరో గా కొన్ని సినిమాలు చేసాడు కానీ, అవి అభిమానులను అలరించలేదు. ఫ్యాన్స్ హీరో గా ఆయన నుండి భారీ కం బ్యాక్ కోరుకుంటున్న సమయంలో ఈ మహారాజా చిత్రం తగిలింది. ఆయన కెరీర్ లోనే మొట్టమొదటి వంద కోట్ల రూపాయిల గ్రాస్ ని రాబట్టిన సినిమాగా నిల్చింది. కేవలం థియేటర్స్ లోనే కాదు, ఓటీటీ లో కూడా ఈ సినిమాకి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

    నెట్ ఫ్లిక్స్ లో తెలుగు, తమిళం, హిందీ మరియు ఇతర ప్రాంతీయ భాషల్లో విడుదలైన ఈ సినిమా, ఏకంగా 6 నెలలకు పైగా ట్రెండ్ అయ్యింది. #RRR తర్వాత నెట్ ఫ్లిక్స్ లో ఆ రేంజ్ లో ట్రెండ్ అయిన సినిమా ఇదే. సెలెబ్రెటీలకు కూడా ఈ సినిమా తెగ నచ్చేసింది. ముఖ్యంగా బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ ఈ చిత్రం రీమేక్ రైట్స్ ని కొనుగోలు చేసాడు. త్వరలోనే ఆయన ఈ రీమేక్ లో నటించబోతున్నాడు. ఇతర భాషల్లో కూడా ఈ సినిమా రీమేక్ రైట్స్ కి మామూలు రేంజ్ క్రేజ్ లేదు. ఇదంతా పక్కన పెడితే ఇలాంటి సినిమాలకు చైనా దేశం లో అద్భుతమైన ఆదరణ వస్తుంది. ‘దంగల్’ చిత్రం అక్కడ 1400 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది అంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు, ఇలాంటి కంటెంట్స్ కి అక్కడ ఎలాంటి ఆదరణ ఉంటుంది అనేది. ఇప్పుడు మహారాజా చిత్రాన్ని కూడా చైనా భాషలోకి దబ్ చేసారు.

    ఈ నెల 29వ తారీఖున ఈ సినిమా ఆ దేశంలో 40 వేలకు పైగా థియేటర్స్ లో విడుదల కాబోతుంది. దీంతో విజయ్ సేతుపతి అభిమానులు కచ్చితంగా ఈ చిత్రం చైనాలో బాక్స్ ఆఫీస్ ప్రకంపనలు సృష్టిస్తుందని, దంగల్ రికార్డ్స్ ని బద్దలు కొడుతుందని బలమైన నమ్మకంతో సోషల్ మీడియా లో పోస్టులు వేస్తున్నారు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి కేవలం నటించడం మాత్రమే కాదు, నిర్మాతగా కూడా వ్యవహరించాడు. కచ్చితంగా అక్కడి ఆడియన్స్ క్లైమాక్స్ ని చూసి మెంటలెక్కకిపోతారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మంచి ఎమోషన్స్ తో సాగిపోయే ఈ సినిమా అంచనాలకు తగ్గట్టుగానే వసూళ్లను రాబడుతుందా లేదా అనేది చూడాలి. విజయ్ సేతుపతి ఈ రిలీజ్ ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రొమోషన్స్ లో కూడా పాల్గొనబోతున్నారు.
    One attachment • Scanned by Gmail