Telugu Politics: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆరు నెలల వ్యవధిలో అధికార మార్పిడి జరిగింది. ప్రజలు అధికారంలో ఉన్నవారిని ప్రతిపక్షంలో.. ప్రతిపక్షంలో ఉన్నవారిని అధికారంలోకి తెచ్చారు. దీంతో రెండు రాష్ట్రాల్లోనూ రాజకీయాలు మారిపోయాయి. తెలంగాణలో బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి జరిగిగింది. ఏపీలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రాజకీయాలు, విధ్వంసాలు జరిగాయి. ఇక ప్రభుత్వాలు మారిన తర్వాత రాజకీయలు, అభివృద్ధి కూడా తారుమారైంది. ఇప్పుడు రేవంత్ సర్కార్ తెలంగాణలో రాజకీయాలు చేస్తుంటే.. ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం అభివృద్ధిపై దృష్టిపెట్టింది.
తెలంగాణలో ఇలా..
తెలంగాణలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభంలో గుడ్ సీఎంగా గుర్తింపు తెచ్చుకున్నారు. సమష్టి నిర్ణయాలు, అందరినీ కలుపుకుపోయే తత్వంతో ఆయనకు మంచి మార్కులే పడ్డాయి. అయితే ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ను కట్టడి చేయడంలో ఇప్పుడు తడబడుతున్నారు. బీఆర్‌ఎస్ దూకుడును అడ్డుకోవడంలో రేవంత్‌తోపాటు, ఆయన మంత్రులు కూడా వెనుకబడుతున్నారు. ఒఏసారి నాలుగైదు కేసుల విచారణ జరుగుతున్నా.. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులు ఏమాత్రం బెదరడం లేదు. రేవంత్‌రెడ్డిపై ఎదురుదాడి చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిఫెన్స్‌లో పడేస్తున్నారు. హైడ్రా కూల్చివేతలు, మూసీ ప్రక్షాళన పేరిట ఇళ్లు కూల్చడం రేవంత్ సర్కార్‌కు మైనస్‌గా మారాయి. పరిశ్రమలు, పెట్టుబడులు సాధించకపోవడంతో బీఆర్‌ఎస్ నేతలు రేవంత్‌ను టార్గెట్ చేస్తున్నారు. తాజాగా రేవంత్‌రెడ్డి నియోజకవర్గం కొడంగల్‌లో పార్మా కంపెనీకి భూసేకరణ విషయం బీఆర్‌ఎస్‌ను అడ్వాంటేజ్‌గా తీసుకుంది. దాడిచేసింది బీఆర్‌ఎస్ నేతలే అయినా.. మళ్తీ తమకే దెబ్బతాకినట్లు ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. రాష్ట్రపతికి ఫిర్యాదు చేసే ఆలోచనలో కూడా ఉన్నారు.
అభివృద్ధిలో ఏపీ..
ఇక టీడీపీ–బీజేపీ–జనసేన నేతృత్వంలో ఏపీలో ఏర్పడిన కూటమి ప్రభుత్వ పాలనలో ఏపీలో అభివృద్ధి ఊపందుకుంది. గత విధ్వంసం నుంచి ఏపీ రికవరీ అవుతోంది. ఇదే సమయంలో కూటమి సర్కార్ వైసీపీ నేతలను ఓ ఆటాడుకుంటుంది. టామ్ అండ్ జెర్రీలా రెండు పార్టీల మధ్య రాజకీయాలు సాగుతున్నాయి. తెలంగాణలో వైసీపీకి ఎమ్మెల్యే బలం ఉంది. కానీ ఏపీలో వైసీపీకి ఆ అవకాశం లేకుండా పోయింది. దీంతో వైసీపీని అధికార టీడీపీ తరుముతోంది.