Vijay and Sangeetha Divorce Case: తమిళ హీరో విజయ్(Thalapathy Vijay) కి భార్య సంగీత మరో ఊహించని షాక్ ఇచ్చింది. ఇద్దరి మధ్య సెటిల్మెంట్స్ జరిగిపోయాయి కదా, విజయ్ ఆమెకు 250 కోట్ల రూపాయిల భరణం కూడా ఇచ్చేశాడని అన్నారు, మరి ఇదేంటి అని మీరు అనుకోవచ్చు. కానీ ఆమె పిటీషన్ ఎందుకు వేసిందంటే , ఈ విడాకుల వ్యవహారం విషయం కోర్టు లో నడిచేంత వరకు తనను ప్రస్తుతం విజయ్ ఉంటున్న ఇంట్లోనే ఉండనివ్వాలని ఆమె కోరింది. మరి దీనిపై కోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వబోతుందో చూడాలి. రీసెంట్ గానే విజయ్ ప్రముఖ హీరోయిన్ త్రిష తో కలిసి చెన్నై లో ఒక పెళ్లి ఫంక్షన్ లో కనిపించడం తమిళనాడు రాజకీయాల్లో సెన్సేషనల్ టాపిక్ గా మారింది. ఎక్కడ చూసినా దీని గురించే చర్చ. ఇలాంటి సమయం లో సంగీత ఈ పిటీషన్ వేయడం ఆశ్చర్యానికి గురి చేసే విషయం.
సంగీత స్వతహాగా వందల కోట్ల రూపాయిలు ఆస్తులు ఉన్న మహిళా. విడాకుల పిటీషన్ లో ఆమె తనకు ఎలాంటి భరణం అవసరం లేదని, విజయ్ ఉంటున్న ఇల్లు నా పరం చేస్తే చాలు అని కోరింది. కానీ ఇప్పుడు మీడియా లో ఆమె భరణం తీసుకోవడానికి ఒప్పుకుంది అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యం లో ఆమె విడాకుల వ్యవహారం పై కేసు నడిచేంత కాలం తనని ఆ ఇంట్లోనే ఉండనివ్వాలి అంటూ పిటీషన్ వేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ వ్యవహారం రాబోయే రోజుల్లో ఎలాంటి మలుపులు తీసుకుంటుందో చూడాలి. ఇదంతా పక్కన పెడితే వీళ్లిద్దరికీ ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొడుకు జేసన్ సంజయ్ కి పాతికేళ్ళు , కూతురు కి 20 ఏళ్ళు. విడాకులు తీసుకున్న తర్వాత వీళ్లిద్దరు తల్లితో కలిసి ఉంటారా ?, లేదా తండ్రి తో కలిసి ఉంటారా అనేది చూడాలి.
వీళ్లిద్దరు కూడా విజయ్ తో చాలా కాలం నుండి మాట్లాడడం లేదని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. సంజయ్ కూడా రీసెంట్ గానే ఇండస్ట్రీ లోకి డైరెక్టర్ గా అడుగుపెట్టాడు. తండ్రి తో సంబంధం లేకుండా, కేవలం తన టాలెంట్ తో సన్ పిక్చర్స్ ని మెప్పించి, ఈ అవకాశాన్ని సంపాదించినట్టు తెలుస్తోంది. ‘సిగ్మా ‘ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం లో సందీప్ కిషన్ హీరో గా నటిస్తున్నాడు. దీనికి సంబంధించిన టీజర్ కూడా విడుదలై మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది.