Vijay : తమిళ సూపర్ స్టార్ విజయ్(Ilayathalapathy Vijay) ఇటీవలే రంజాన్ మాసం ప్రారంభమైన సందర్భంగా ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా లో లీక్ అవ్వడం, అవి బాగా వైరల్ అయ్యి విజయ్ పై ట్రోల్స్ రావడం వంటివి మనం చూస్తూనే ఉన్నాం. అయితే నిన్న తమిళనాడు సున్నత్ జమాత్ విజయ్ పై పోలీస్ స్టేషన్ లో కేసు వేశారు. కారణం ఏమిటంటే పవిత్రమైన రంజాన్ మాసం లో విజయ్ ఇతర మతాలకు చెందిన రౌడీలకు, గూండాలకు, అవినీతి పరులకు ఇఫ్తార్ విందు ని ఏర్పాటు చేశాడని, ఇది మా పవిత్రమైన ఇఫ్తార్ విందు ని వమానించడమే అని, తక్షణమే దీనిపై విచారణ చేపట్టి విజయ్ పై చర్యలు తీసుకోవాలంటూ కేసు వేశారు. రంజాన్ మాసం లో మంచి ఆలోచనలు ప్రమోట్ చేయాల్సింది పోయి, విజయ్ అసాంఘిక శక్తులను ప్రోత్సహించి మతాన్ని అగౌరవపరుస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసారు.
Also Read : శుభాకాంక్షలు తెలియజేయడం లో కూడా రాజకీయమేనా..? తమిళ హీరో విజయ్ పై మండిపడుతున్న అభిమానులు!
అయితే ఇప్పుడు విజయ్ ఈ కేసు లో అరెస్ట్ అవబోతున్నాడా?, ప్రభుత్వానికి ఎదురు వెళ్తున్నాడు కాబట్టి, తమిళనాడు ప్రభుత్వం అతని పై కక్ష్యపూరిత చర్యలు తీసుకోనుందా వంటి అనుమానాలు అభిమానుల్లో వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే గతంలో విజయ్ కేవలం రాజకీయాల్లోకి రాబోతున్నాను అని మీడియా కి ఒక సమాచారం ఇచ్చిన వెంటనే, ఆయన నటించిన కొత్త సినిమాలకు టికెట్ రేట్స్ హైక్స్ ఇవ్వడానికి నిరాకరించింది తమిళనాడు ప్రభుత్వం. దీంతో ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి కచ్చితంగా ఆయన్ని ఇబ్బంది పెట్టే ఆలోచనలు ఏమైనా ప్రభుత్వానికి ఉన్నాయా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అభిమానులు.
ఇకపోతే విజయ్ ప్రస్తుతం ‘జన నాయగన్'(Jana Nayagan) అనే చిత్రం చేస్తున్నాడు. తెలుగు లో సూపర్ హిట్ గా నిల్చిన ‘భగవంత్ కేసరి’ కి ఇది రీమేక్. ఇందులో పూజా హెగ్డే(Pooja Hegde) హీరోయిన్ గా నటిస్తుండగా, ప్రేమలు ఫేమ్ మమిత బైజు(Mamitha Baiju) విజయ్ కి కూతురు పాత్రలో నటించనుంది. అదే విధంగా బాబీ డియోల్ ఇందులో విలన్ క్యారక్టర్ చేస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14 , 2026 వ సంవత్సరం లో విడుదల కానుంది. ఈ సినిమానే విజయ్ చివరి చిత్రం. ఆ తర్వాత ఆయన వచ్చే ఏడాది లో జరిగే సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేయబోతున్నాడు. ఎన్నికలలో గెలిచి ముఖ్యమైన పదవి చేపడితే ఆయన సినిమాలు ఇక భవిష్యత్తులో కొనసాగించకపోవచ్చు. ఒకవేళ ఓడిపోతే మాత్రం పవన్ కళ్యాణ్ లాగానే మళ్ళీ సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టొచ్చు, చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.
Also Read : తమిళ హీరో విజయ్ ఇంటి పై చెప్పులతో దాడి చేసింది అభిమానియేనా..? కారణం ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు!