https://oktelugu.com/

Vijay: ‘మాతో పెట్టుకోవద్దు..జాగ్రత్త’ అంటూ మోడీకి విజయ్ స్ట్రాంగ్ వార్నింగ్!

Vijay జీఎస్టీ వసూళ్ల పంపిణీలో ఊహించని వ్యత్యాసం, మహిళలపై రోజురోజుకు జరుగుతున్నా అత్యాచారాలు, జమిలీ ఎన్నికల ప్రక్రియ, ఇలా ఎన్నో అంశాలపై కేంద్రాన్ని ఆయన తీవ్ర స్థాయిలో తప్పుబట్టాడు.

Written By: , Updated On : March 28, 2025 / 09:51 PM IST
Vijay

Vijay

Follow us on

Vijay: తమిళ హీరో విజయ్(Thalapathy Vijay) రాజకీయాల్లో దూకుడుని పెంచాడు. వచ్చే ఏడాది తమిళనాడు లో అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటి నుండే వ్యూహరచన మొదలు పెట్టాడు విజయ్. నేడు ఆయన స్థాపించిన తమిళగ వెట్రి కజగమ్(TVK) పార్టీ తొలి సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు సంచలనం గా మారాయి. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(PM Narendra Modi) ని నేడు ఆయన డైరెక్ట్ ఎటాక్ చేశాడు. ఆయన మాట్లాడిన ఆ మాటలు ఇప్పుడు తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వం లో ఉన్నటువంటి DMK, బీజేపీ పార్టీలు రహస్య మిత్రులని, పేరుకి మాత్రమే కాంగ్రెస్ కూటమిలో DMK ఉందని విజయ్ వ్యాఖ్యానించాడు. ఈ సందర్భంగా ఆయన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన డీలిమిటేషన్ అంశం పై, అదే విధంగా త్రిభాషా విధానం తో హిందీ భాషను బలవంతంగా రుద్దాలని చేసే ప్రయత్నం పై పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.

జీఎస్టీ వసూళ్ల పంపిణీలో ఊహించని వ్యత్యాసం, మహిళలపై రోజురోజుకు జరుగుతున్నా అత్యాచారాలు, జమిలీ ఎన్నికల ప్రక్రియ, ఇలా ఎన్నో అంశాలపై కేంద్రాన్ని ఆయన తీవ్ర స్థాయిలో తప్పుబట్టాడు. మధ్యలో ఆయన సినిమా సినిమా స్టైల్ లో కొట్టిన డైలాగ్స్ కి అక్కడికి వచ్చిన అభిమానులు కేరింతలు కొట్టారు. ‘గాలిని ఆపాలనుకుంటే అది పెను తుఫానుగా మారిపోతుంది’ అంటూ ఆయన వార్నింగ్ ఇచ్చాడు. ప్రధాని మోడీ ని ఉద్దేశించి మాట్లాడుతూ ‘మిస్టర్ ప్రధానమంత్రి, మా తమిళనాడు తో కాస్త జాగ్రత్తగా నడుచుకో. మా రాష్ట్రంలో వేర్పాటు వాదానికి తావు లేదు. మేము అనేక ఉమ్మడి ఒప్పందాలకు ప్రతీక, విభజన శక్తులను తీవ్రంగా వ్యతిరేకించేవాళ్ళం. అన్ని మతాలకు చెందిన వారు ఇక్కడ అన్నదమ్ములు లాగా కలిసి ఉంటారు. మీ మాత రాజకీయాలను మా రాష్ట్రానికి తీసుకొని రాకండి’ అంటూ చెప్పుకొచ్చాడు.

త్రిభాషా విధానంపై DMK పార్టీ డ్రామాలు ఆడుతుంది అంటూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ పై విజయ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. బీజేపీ పాట పాడుతుంటే , DMK ఆ పాటకు డ్యాన్స్ వేస్తుంది అంటూ ఆయన విరుచుకుపడ్డారు. విజయ్ DMK పార్టీ పై, స్టాలిన్ పై ఈ స్థాయిలో విరుచుకుపడుతుంటే, అటు వైపు నుండి మాత్రం ఎలాంటి రియాక్షన్ రాకపోవడం గమనార్హం. అంటే విజయ్ మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని DMK పార్టీ అనుకుంటుందా?, విజయ్ పార్టీ ని తక్కువ అంచనా వేస్తుందా?, రాబోయే ఎన్నికలలో DMK మరియు TVK పార్టీల మధ్యనే పోటీ ఉంటుందని, విజయ్ నేడు కూడా చెప్పుకొచ్చాడు. కానీ DMK పార్టీ మాత్రం విజయ్ ని అసలు లెక్క చేయడం లేదు. మరోపక్క విజయ్ రాబోయే ఎన్నికలలో ఒంటరిగానే పోటీ చేసేలా ఉన్నాడు. అలా ఒంటరిగా వెళ్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో అని ఆయన అభిమానులు సైతం భయాన్ని వ్యక్తం చేస్తున్నారు.