Vijay and Gopichand Malineni : ప్రస్తుతం నడుస్తున్న పాన్ ఇండియన్ మూవీ ట్రెండ్ లో మన స్టార్ హీరోలందరూ పాన్ ఇండియన్ సినిమాలను చేస్తూ, తెలుగు కమర్షియల్ ఫార్మటు లో సినిమాలు చేయడం మానేశారు. అలాంటి సమయంలో గోపీచంద్ మలినేని(Gopichand Malineni) వంటి టాలెంటెడ్ కమర్షియల్ డైరెక్టర్స్ సీనియర్ హీరోలతో వరుసగా సినిమాలు చేస్తూ సూపర్ హిట్స్ ని అందుకుంటున్నాడు. ఇతను మాస్ మహారాజ రవితేజ హీరో గా నటించిన ‘డాన్ శ్రీను’ అనే చిత్రం ద్వారా మన టాలీవుడ్ ఆడియన్స్ కి డైరెక్టర్ గా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత అదే రవితేజ తో ‘బలుపు’ అనే చిత్రం చేసి కెరీర్ లో మొట్టమొదటి బ్లాక్ బస్టర్ ని అందుకున్నాడు. కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో రవితేజ తో ‘క్రాక్’ చిత్రం చేసి టాలీవుడ్ షేక్ అయ్యే రేంజ్ లో సూపర్ హిట్ ని అందుకున్నాడు. ఈ సినిమాతో గోపీచంద్ అందరి దృష్టిలో పడ్డాడు. మంచి విషయం ఉన్న డైరెక్టర్ అని పేరు తెచ్చుకున్నాడు.
Also Read : ఆ స్టార్ హీరో స్టోరీ తోనే సన్నీ డియోల్ తో సినిమా చేస్తున్న గోపిచంద్ మలినేని…
‘క్రాక్’ తర్వాత ఆయన నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) తో చేసిన ‘వీర సింహా రెడ్డి’ చిత్రం కమర్షియల్ గా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా తర్వాత జరిగిన ఒక సంఘటన ని గోపీచంద్ రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడుతూ ‘ వీర సింహా రెడ్డి చిత్రం తర్వాత నేను తమిళ స్టార్ హీరో విజయ్(Thalapathy Vijay) గారితో ఒక సినిమా చెయ్యాలని అనుకున్నాను. చెన్నై కి వెళ్లి ఆయనకు స్టోరీ ని కూడా వినిపించాను. కేవలం సింగల్ సిట్టింగ్ లోనే ఆయన ఈ కథని ఓకే చేశారు. త్వరలోనే అధికారిక ప్రకటన కూడా చేద్దాం అనుకున్నాము. కానీ విజయ్ సన్నిహితులు ఈ చిత్రాన్ని అత్తికెక్కించే ప్రయత్నం చేసారు’ అంటూ చెప్పుకుకొచ్చాడు.
ఇంకా ఆయన మాట్లాడుతూ ‘రీసెంట్ గానే తెలుగు డైరెక్టర్ వంశీ పైడిపల్లి తో ‘వారిసు’ చిత్రం చేసావు . ఇప్పుడు మళ్ళీ మరో తెలుగు డైరెక్టర్ తో సినిమా అంటే, జనాల్లో నెగటివిటీ పెరుగుతుంది . అసలే రాజకీయాల్లోకి వెళ్ళబోతున్నావు అని ఆయన సన్నిహితులు చెప్పి ఉంటారు. అందుకే ఈ సినిమాని రద్దు చేసాడేమో ‘ అని చెప్పుకొచ్చాడు గోపీచంద్ మలినేని. రీసెంట్ గానే బాలీవుడ్ సీనియర్ హీరో సన్నీ డియోల్ తో ‘జాట్’ అనే చిత్రం చేసి సూపర్ హిట్ ని అందుకున్నాడు . ఇప్పుడు త్వరలోనే బాలయ్య బాబు తో కలిసి ఒక సినిమా చేయబోతున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన పూజ కార్యక్రమాలు జూన్ 10 న జరగంబోతున్నది. ఈ చిత్రం తర్వాత పవన్ కళ్యాణ్ తో కూడా ఒక సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాడట డైరెక్టర్ గోపీచంద్.
Also Read : హీరో విజయ్ పార్టీ తో త్రిష, కీర్తి సురేష్ కి ఉన్న సంబంధం అదేనా?