Vijay: సినీ హీరోలు రాజకీయాల్లోకి వచ్చారంటే, ప్రత్యర్థులు వాళ్ళ వ్యక్తిగత వ్యవహారాల మీదనే టార్గెట్ చేస్తుంటారు. ఎందుకంటే వాళ్లకు ఎలాంటి రాజకీయ చరిత్ర అంతకు ముందు లేదు కాబట్టి, ఎలాంటి అవినీతి ఆరోపణలు ఉండవు కాబట్టి. పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) విషయం లో ప్రత్యర్థులు ఎలా వ్యవహరించేవారో గత పదేళ్లు గా మనం ఎన్నో సందర్భాల్లో చూస్తూనే ఉన్నాం. అంతకు ముందు చిరంజీవి పై కూడా ఇలాంటి ఆరోపణలు ఎదురయ్యాయి. ఇప్పుడు తమిళ హీరో విజయ్(Thalapathy Vijay) కూడా అలాంటి అనుభువాలను ఎదురుకుంటున్నాడు. ఏడాది క్రితం ఆయన ‘తమిళగ వెట్రి కజగం(TVK)’ అనే రాజకీయ పార్టీ ని స్థాపించిన సంగతి తెలిసిందే. రీసెంట్ గానే మొదటి వార్షికోత్సవం కూడా చేసాడు. అంతే కాకుండా అప్పుడప్పుడు ఆయన జనాల్లోకి కూడా వస్తూ పలు సభలను నిర్వహిస్తున్నాడు. ఆయన సభలకు వస్తున్నా జనాలను చూసి తమిళనాడు రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి.
ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గానే అధికార DMK పార్టీ మంత్రి పన్నీర్ సెల్వం ఒక సభలో విజయ్ పార్టీ గురించి చాలా నీచంగా, అవహేళన చేస్తూ మాట్లాడాడు. అభిమానులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ‘TVK అంటే ఏమిటి?’ అని అడుగుతాడు. అప్పుడు అభిమానులు ‘త్రిష..విజయ్..కీర్తి సురేష్’ అని బదులిస్తారు. అప్పుడు పన్నీర్ సెల్వం మీరు చాలా తెలివైన వాళ్ళు, టక్కుమని కరెక్ట్ సమాధానం చెప్పారు అంటూ ఆయన ఎగతాళిగా నవ్వుతు సమాధానం చెప్తాడు. అయితే ఎందుకు TVK కి ఆ ఇద్దరి హీరోయిన్స్ ని లింక్ చేశారు అనేది చాలా మందికి తెలియదు. వివరాల్లోకి వెళ్తే సోషల్ మీడియా లో ఫ్యాన్ వార్స్ నడుస్తూ ఉండే సంగతి మన అందరికీ తెలిసిందే. అలా తమిళనాడు అజిత్ మరియు విజయ్ ఫ్యాన్స్ మధ్య ఏ రేంజ్ లో వార్ నడుస్తూ ఉంటుందో సోషల్ మీడియా ని ఉపయోగించే ప్రతీ ఒక్కరికి తెలిసే ఉంటుంది.
అలా ఫ్యాన్ వార్స్ చేసుకుంటున్న సమయం లో అజిత్ ఫ్యాన్స్ విజయ్ కి, కీర్తి సురేష్ కి గతం లో ఎఫైర్ ఉంది అనే రూమర్ ని సోషల్ మీడియా లో బాగా వ్యాప్తి చెందేలా చేసారు. కానీ అందులో ఎలాంటి నిజం లేదని రీసెంట్ గానే కీర్తి సురేష్ పెళ్లి ద్వారా అందరికీ స్పష్టంగా అర్థమైంది. అదే విధంగా విజయ్ త్రిష తో చాలా కాలం నుండి డేటింగ్ చేస్తున్నాడు అనేది ఇప్పటికీ మీడియా లో నడుస్తున్న చర్చ. ఎందుకంటే ప్రైవేట్ గా వీళ్లిద్దరు కలిసి అనేక సందర్భాల్లో కనిపించారు. ఎన్నో రోజుల నుండి ఈ విషయం సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్నప్పటికీ, త్రిష నుండి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు, మాములుగా ఆమె ఇలాంటి రూమర్స్ కి వెంటనే స్పందిస్తూ ఉంటుంది. అలా విజయ్ వీళ్ళిద్దరితో అఫైర్స్ నడిపాడు అనే రూమర్స్ ఉన్నాయి కాబట్టే, TVK కి వాళ్ళిద్దరిని కలిపారు.