Goat Movie Review: ‘గోట్’ ఫుల్ మూవీ రివ్యూ…

వెంకట్ ప్రభు దర్శకత్వంలో హీరో విజయ్ 'గోట్ ' అనే సినిమా చేశాడు. అయితే ఆ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది ప్రేక్షకులను ఆకట్టుకుందా? లేదా అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం...

Written By: Gopi, Updated On : September 5, 2024 9:49 am

Goat Movie Review

Follow us on

Goat Movie Review: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో రజినీకాంత్ తర్వాత అంత గొప్ప పేరు సంపాదించుకున్న హీరో విజయ్…ప్రస్తుతం విజయ్ తనదైన రీతిలో సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో ‘గోట్ ‘ అనే సినిమా చేశాడు. అయితే ఆ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది ప్రేక్షకులను ఆకట్టుకుందా? లేదా అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

కథ

ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే విజయ్ ఒక స్పై ఆఫీసర్ గా పనిచేస్తూ అండర్ కవర్ ఆపరేషన్స్ చేస్తూ ఉంటాడు. ఇక అందులో భాగంగానే ఆయన చాలా కేసులను సాల్వ్ చేస్తూ దేశాన్ని కాపాడుతూ ఉంటాడు. ఇక ఇలాంటి సందర్భంలోనే కొంతమంది దేశద్రోహులు దేశం మీద కొన్ని కుట్రలు పన్నుతూ దేశాన్ని అంతం చేయాలని చూస్తున్న క్రమంలో విజయ్ తన కొడుకు సహాయాన్ని తీసుకొని శత్రువుల ఆట ఎలా కట్టించాడు.. తద్వారా దేశాన్ని ఎలా కాపాడాడు అనేది తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…

విశ్లేషణ

ఇక ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే ఈ సినిమాను వెంకట్ ప్రభు చాలా ప్రత్యేకంగా తెరకెక్కించాడు. నిజానికి సినిమా కథ చిన్నదిగా ఉన్నప్పటికీ దాన్ని స్క్రీన్ ప్లే తో ఇంట్రెస్టింగ్ గా మలిచే ప్రయత్నం అయితే చేశాడు. అయితే ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా ఇంట్రెస్టింగ్ సాగినప్పటికీ సెకండ్ హాఫ్ లో మాత్రం చాలా సీన్లు లాగ్ అయ్యాయి. కొన్ని సందర్భల్లో అయితే సీన్స్ మొత్తం బోర్ కొట్టించే అవకాశాలు కూడా ఉన్నాయి. అందువల్లే ఈ సినిమాని ఇంకా కాస్త ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది. స్క్రీన్ ప్లే కాస్త ఫాస్ట్ గా రాసి ఉంటే బాగుండేదనే అభిప్రాయాలు కూడా వెలువడుతున్నాయి. ఇక అలాగే సాంగ్స్ కూడా అంత పెద్ద ఎఫెక్టివ్ గా అనిపించలేదు. బ్యా గ్రౌండ్ స్కోర్ తో కొంత హై ఫీల్ వచ్చినప్పుడు ఓవరాల్ గా మాత్రం అంత పెద్ద ఇంపాక్ట్ ను అయితే క్రియేట్ చేయలేకపోయింది.

ఇక వెంకట్ ప్రభు చేసిన తన గత చిత్రం ‘కస్టడీ ‘ సినిమా ఫ్లాప్ అయిన విషయం మనకు తెలిసిందే… అయినప్పటికీ విజయ్ తనకు అవకాశాన్ని ఇచ్చాడు. మరి అంత మంచి అవకాశాలు ఇచ్చినప్పుడు వెంకట్ ప్రభు ఈ సినిమా మీద ఇంకాస్త శ్రద్ధ తీసుకొని ఉంటే బాగుండేది…తన పర్ఫామెన్స్ తో సినిమాని ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నం చేసినప్పటికీ కథలో పెద్దగా కాన్ఫ్లిక్ట్ లేదు కాబట్టి సినిమాలో అతను ఎంత బాగా యాక్టింగ్ చేసిన కూడా అది ప్రేక్షకులకు రీచ్ అయ్యేవిధంగా లేకపోవడం అనేది చాలా వరకు ఈ సినిమాకి మైనస్ అయింది… ఇక విజయ్ ఇంట్రడక్షన్ సీన్ బాగున్నప్పటికి ఆ తర్వాత నుంచి సినిమాను ఎలా నడిపించాలో తెలియక దర్శకుడు అతనికి ఇష్టం వచ్చిన విధంగా సినిమాని మలుపులు తిప్పుతూ ముందుకు తీసుకెళ్లాడు. ఒకటి రెండు ట్విస్ట్ లు మాత్రం అద్భుతంగా ఉన్నాయి అనిపించినప్పటికీ అప్పటికే సినిమా చూసే ప్రేక్షకుడు సినిమా నుంచి డిస్ కనెక్ట్ అయిపోతుంటాడు. కాబట్టి ఆ సీన్స్ కూడా ఆయనకి పెద్దగా కిక్ అయితే ఇవ్వవు… ఇలాంటి కథని తీసుకున్నప్పుడు దానికి అనుగుణమైన ఎలివేషన్స్ తో సినిమాని ముందుకు తీసుకెళ్లి ఉంటే బాగుండేది…

ఆర్టిస్టుల పర్ఫామెన్స్

ఇక ఆర్టిస్టులు పర్ఫామెన్స్ విషయానికి వస్తే విజయ్ ఈ సినిమా కోసం తన పూర్తి ఎఫర్ట్స్ పెట్టినట్టుగా తెలుస్తుంది. ఇక ఇందులో ద్విపాత్రాభినయం చేసిన విజయ్ తండ్రి, కొడుకు రెండు పాత్రల్లో చాలా అద్భుతంగా ఒదిగిపోయి నటించినప్పటికి కొడుకు పాత్రలో మాత్రం ఏఐ ద్వారా తన ఫేస్ ని డిజైన్ చేసిన విధానం అయితే అసలు బాలేదు. ఆచార్య సినిమాలో చిరంజీవి కూడా ఇలాగే చేసి బొక్క బోర్ల పడ్డారు. అలాగే ఇప్పుడు విజయ్ విషయంలో కూడా అదే జరిగింది. అసలు ఏ మాత్రం ఏఐతో క్రియేట్ చేసిన ఆయన ఫేస్ ఎవరికి నచ్చలేదు. ఇక దాంట్లో ఆయన్ని చూస్తే ఉడతలు పట్టేవాడిలా ఉన్నాడు అంటూ ఆడియెన్స్ కామెంట్స్ చేస్తున్నారు…అసలు విజయ్ ఎందుకు అలాంటి డిసిజన్ తీసుకున్నాడో ఎవరికి అర్థం కాలేదు దాని బదులు నార్మల్గా విజయ్ కనిపించిన ఇంతకుముందు విజిల్ సినిమాలో చేసిన విజయ్ తండ్రి కొడుకుల పాత్రలను చాలా అద్భుతంగా పోషించాడు. కానీ ఈ సినిమాలో మాత్రం కొడుకు క్యారెక్టర్ కోసం ఆయనకి సెట్ చేసిన ఫేస్ అతనికి అసలు సెట్ కాలేదు… ఇక ఈ సినిమా నటించిన ప్రశాంత్, ప్రభుదేవా లు వాళ్లు పాత్ర పరిధి మేరకు నటించి మెప్పించే ప్రయత్నం అయితే చేశారు. స్నేహ కూడా తన నటనతో మెప్పించింది. ఇక యోగి బాబు కూడా అక్కడక్కడ తన కామెడీతో నవ్వులు పూయించే ప్రయత్నం చేశాడు…ఇక మిగిలిన ఆర్టిస్టులందరూ వాళ్ల పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించారు…

టెక్నికల్ అంశాలు

ఇక ఈ సినిమా టెక్నికల్ అంశాల విషయానికొస్తే మొదటగా ఈ సినిమాకి మ్యూజిక్ అందించిన యువన్ శంకర్ రాజా గురించి మాట్లాడుకోవాలి. ఈ సినిమాలోని సాంగ్స్ ప్రేక్షకులను ఏ మాత్రం మెప్పించలేకపోయాయి. కనీసం బ్యా గ్రౌండ్ స్కోర్ తో అయిన సినిమా మీద అంచనాలను పెంచుతారేమో అనుకుంటే అది కూడా ఏమాత్రం బాగాలేదు. ఇక ఎమోషన్స్ సీన్స్ లో బ్యాగ్రౌండ్ స్కోర్ చాలా వీక్ గా ఉండటం వల్ల ఆ సీన్స్ కూడా సరిగ్గా పండలేదు… ఇక సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే విజువల్స్ పరంగా సినిమా బాగున్నప్పటికీ సినిమా తేడా కొట్టడంతో సినిమా అనేది ఆధ్యాంతం ప్రేక్షకుడికి ఇంట్రెస్ట్ లేకుండా సాగింది.

ఇక ఎంత మంచి విజువల్స్ అందించినప్పటికి సినిమాకి జరగాల్సిన నష్టం ముందు జరిగిపోయింది. కాబట్టి విజువల్ గా కూడా సినిమా ప్రేక్షకుడిని ఆకట్టుకోలేకపోయింది… ఎడిటింగ్ విషయానికి వస్తే సెకండాఫ్ సినిమాని కాస్త ట్రిమ్ చేస్తే సినిమా చాలా బాగా వచ్చుండేది. అలాగే ప్రేక్షకుడిని కూడా ఇబ్బందికి గురి చేయకుండా సినిమా చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతున్న ఫీల్ అయితే కలిగేది. అలా కాకుండా సినిమా లెంత్ ఎక్కువగా ఉండడమే కాకుండా సెకండ్ హాఫ్ సీన్స్ మొత్తం లాగయ్యాయి. మరి ఎడిటర్ కట్ చేయాలని చూశాడా? లేదంటే దర్శకుడు యొక్క నిర్ణయానికే వదిలేసి సినిమాను అలాగే కంటిన్యూ చేశారో తెలీదు కానీ సెకండాఫ్ లో మాత్రం చాలా సీన్స్ ను కట్ చేయాల్సిన అవసరమైతే ఉంది…

ప్లస్ పాయింట్స్

విజయ్
కథ

మైనస్ పాయింట్స్

స్క్రీన్ ప్లే
మ్యూజిక్
బోర్ కొట్టించే సీన్స్

రేటింగ్

ఈ సినిమాకి మేమిచ్చే రేటింగ్ 2.25/5

చివరి లైన్
ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది…