spot_img
Homeఎడ్యుకేషన్Haryana Job: రోడ్లు ఊడ్చే ఉద్యోగానికి నోటిఫికేషన్‌.. దరఖాస్తుదారుల్లో 46 వేల మంది గ్రాడ్యుయేట్లు.. నిరుద్యోగ...

Haryana Job: రోడ్లు ఊడ్చే ఉద్యోగానికి నోటిఫికేషన్‌.. దరఖాస్తుదారుల్లో 46 వేల మంది గ్రాడ్యుయేట్లు.. నిరుద్యోగ భారతానికి అద్దం పట్టిన వైనం!

Haryana Job: దేశంలో నిరుద్యోగం ఏటేటా పెరుగుతోంది. ప్రభుత్వ ఉద్యోగాలు తగ్గిపోవడం, ప్రైవేటు రంగంలో రాణించే అంత నైపుణ్యాలు నేటి చదువుల్లో లేకపోవడంతో చాలా మంది యువత నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. కొందరు సొంత ఉపాధిపై దృష్టి పెడుతున్నారు. కొందరు వ్యాపారాలు చేసుకుంటున్నారు. కొందరు డ్రైవర్లుగా, కూలీలుగా పనిచేస్తున్నారు. అందరికీ ఉద్యోగాలు ఏ ప్రభుత్వం కూడా ఇవ్వదు. కానీ, చాలా మంది అదృష్టం కలిసి వస్తే ఉద్యోగం రాకపోతుందా అన్న ఆశతో దరఖాస్తు చేసుకుంటారు. ఉద్యోగం సాదించడానికి కష్టపడేవారు మాత్రం తక్కువ మందే ఉంటారు. ప్రభుత్వ ఉద్యోగం కావాలన్న లక్ష్యంతో చాలా మంది ఇప్పుడు అర్హతతో సంబంధం లేకుండా స్వీపర్‌ ఉద్యోగమైనా సరే మంచిదని అనుకుంటున్నారు. తాజాగా హరియాణా ప్రభుత్వం స్వీపర్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన ఇవ్వగా దరఖాస్తుదారుల్లో 46 వేల మంది గ్రాడ్యుయేట్లు ఉండడం గమనార్హం.

లక్షకుపైగా దరఖాస్తులు..
దేశంలో నిరుద్యోగం అతి పెద్ద సమస్యగా మారింది. ప్రతీ ఏటా లక్షలాది మంది డిగ్రీలు, పీజీలు పూర్తి చేసుకుని.. బయటకు వస్తున్నారు. అయితే ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తూ నిరుద్యోగులుగా మారుతున్నారు. 10వ తరగతి అర్హతతో నోటిఫికేషన్‌ వెలువడినా.. డిగ్రీలు, పీజీలు, పీహెచ్‌డీలు పూర్తి చేసిన వారు పోటీ పడుతున్నారు. అటెండర్, స్వీపర్, ప్యూన్‌ ఉద్యోగాలకు.. గ్రాడ్యుయేట్లు పోటీ పడుతున్న ఘటనలు మనం తరచూ చూస్తూనే ఉన్నాం. హరియాణా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన స్వీపర్‌ పోస్టులకు ఏకంగా లక్ష మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో వింత ఏముంది అనుకుంటున్నారా. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న వారిలో 46 వేల మంది పీజీలు, డిగ్రీలు చేసిన వారు ఉన్నారు. పైగా ఇదేమైనా ప్రభుత్వ ఉద్యోగమా అంటే కేవలం కాంట్రాక్ట్‌ ఉద్యోగం మాత్రమే. జీతం కూడా నెలకు రూ.15 వేలే.

6 వేల మంది పోస్టు గ్రాడ్యుయేటు..
హరియాణాలో కాంట్రాక్ట్‌ స్వీపర్‌ ఉద్యోగాలకు లక్ష మందికిపైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 6 వేల మంది పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ పూర్తి చేసుకున్న వారు ఉన్నారు. 40 వేల మంది గ్రాడ్యుయేట్లు.. 1. 2 లక్షల మంది అండర్‌ గ్రాడ్యుయేట్లు అప్లై చేసుకున్నారు. అయితే రోడ్లు ఊడ్చే ఈ స్వీపర్‌ ఉద్యోగం కోసం లక్ష మందికిపైగా నిరుద్యోగులు దరఖాస్తు చేసుకోవడం.. అందులో పీజీలు, డిగ్రీలు పూర్తి చేసిన వారు కూడా ఉండటంతో అధికారులు తీవ్ర ఆశ్చర్యానికి గురవుతున్నారు.

హరియాణాలో నిరుద్యోగ సమస్య.
హర్యానాలో ప్రభుత్వ ఉద్యోగాలు పక్కన పెడితే ప్రైవేటు ఉద్యోగాలు కూడా దొరకడం లేదు. ఇక దొరికిన ప్రైవేటు ఉద్యోగంలోనూ రూ.10 వేల జీతం మాత్రమే ఇస్తున్నారని.. అది ఎందుకూ సరిపోవడం లేదని నిరుద్యోగులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఈ కాంట్రాక్ట్‌ స్వీపర్‌ ఉద్యోగంలోనైనా చేరితే జీతం రూ.15 వేలు అందడంతో పాటు భవిష్యత్తులో పర్మినెంట్‌ అవుతుందని భావిస్తున్నారు. మరికొందరు నిరుద్యోగులు అయితే ప్రస్తుతం ఏ పనీ లేకుండా ఖాళీగా ఉన్నామని.. ఆర్థిక సమస్యలు, ఇతర కారణాల వల్ల ఈ స్వీపర్‌ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నట్లు చెప్పారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

OnePlus N6x: ఒక్కసారి చార్జింగ్ చేస్తే 2.5 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ధర రూ.20 వేల లోపే..

OnePlus N6x: ప్రస్తుత కాలంలో మొబైల్ వాడకం పెరిగిపోయింది.దీంతో బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ కావాలని వినియోగదారులు కోరుకుంటున్నారు. వీరికి అనుగుణంగా కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా బ్యాటరీ బ్యాకప్ విషయంలో ఫోకస్ పెడుతున్నారు. ఇప్పటి...

POCO M8 Power: కొత్త ఫోన్ వస్తుందని పోస్టర్ రిలీజ్ చేసిన కంపెనీ.. ఇది ఎలా ఉంటుందంటే..

POCO M8 Power: కొత్త ఫోన్ కొనాలని ఎదురుచూసేవారికి POCO కంపెనీ గుడ్ న్యూస్ తెలిపింది. అద్భుతమైన కెమెరాతో పాటు భారీ బ్యాటరీ బ్యాకప్, స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ కలిగిన ఈ...

Honda CB500: రాయల్ ఎన్ ఫీల్డ్ కు గట్టి పోటీ ఇచ్చే బైక్ ఇది..

Honda CB500: ఇప్పటి వరకు స్టైలిష్ తో పాటు స్పీడ్ బైక్ అనగానే ఎక్కువగా Royal Enfield గురించే మాట్లాడుకునేవారు. కానీ ఈ కంపెనీకి పోటీ ఇచ్చేందుకు చాలా కంపెనీలు రకరకాల...

Social Companionship: మీకు ఓ తోడు కావాలా.. గంటకు ఇంత.. కొత్త ట్రెండ్

Social Companionship: సాటి మనిషి పక్కన ఉంటే మాట్లాడే అవకాశం లేదు. మాట్లాడాలి అని కూడా అనుకోవడం లేదు. కుటుంబ సభ్యుల మధ్య కూడా ఇటువంటి దూరమే కొనసాగుతోంది. స్మార్ట్ ఫోన్ మొత్తం...

Andhra Pradesh Voter List: ఏపీలో 44.71 లక్షల ఓట్లు ఔట్!

Andhra Pradesh Voter List: రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎన్యుమరేషన్ ప్రక్రియ పూర్తయింది. రాష్ట్రవ్యాప్తంగా లక్షల ఓట్లు జాబితా నుంచి తొలగించబడ్డాయి. గత కొద్దిరోజులుగా జరుగుతున్న క్షేత్రస్థాయి పరిశీలనలో...
Oktelugu Epaper
Exit mobile version