Homeఎంటర్టైన్మెంట్Vijay money statement: అంత డబ్బులు ఇవ్వలేను అంటూ భార్య సంగీత కి తెగేసి చెప్పిన...

Vijay money statement: అంత డబ్బులు ఇవ్వలేను అంటూ భార్య సంగీత కి తెగేసి చెప్పిన విజయ్..

Vijay money statement: ప్రముఖ తమిళ స్టార్ హీరో , టీవీకే(TVK Party) పార్టీ అధినేత విజయ్(Thalapathy Vijay) విడాకుల వ్యవహారం నేడు కోర్టు లో విచారణకు వచ్చింది. విజయ్ సతీమణి సంగీత చెంగలపట్టు ఫ్యామిలీ కోర్టు లో విజయ్ నుండి తనకు విడాకులు కోరుతూ పిటీషన్ దాఖలు వేసిన సంగతి తెలిసిందే. ఆ పిటీషన్ లో ఆమె విజయ్ పై చేసిన సంచలన ఆరోపణలు నేషనల్ వైడ్ గా పెద్ద దుమారమే రేగింది. ప్రముఖ హీరోయిన్ త్రిష తో విజయ్ అక్రమ సంబంధం పెట్టుకున్నాడని మీడియా లో ఎప్పటి నుండో నడుస్తున్న చర్చ. ఈ నేపథ్యంలో రీసెంట్ గానే విజయ్ త్రిష తో కలిసి ఒక పెళ్లి ఫంక్షన్ లో పాల్గొనడాన్ని చూసి , విజయ్ అభిమానులు సంగీత చేసిన ఆరోపణలు నిజమని నిర్థారించారు. ఇకపోతే వీళ్లిద్దరి మధ్య భరణం విషయం లో చర్చలు కూడా జరిగినట్టు తెలుస్తోంది.

సంగీత 250 కోట్ల రూపాయిలను విజయ్ నుండి డిమాండ్ చేసింది. కానీ విజయ్ అంత డబ్బులు చెల్లించడానికి సిద్ధంగా లేడు , కేవలం 35 కోట్ల రూపాయిలు మాత్రమే ఇవ్వగలనని ఆయన తెగేసి చెప్పాడట. మరి ఈరోజు విచారణ లో కోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వనుంది అనేది ఆసక్తికరంగా మారిన అంశం. ఒకవేళ కోర్టు 250 కోట్లు కచ్చితంగా చెల్లించాల్సిందే అని ఆదేశిస్తే విజయ్ చెల్లించక తప్పదు. మరో మూడు రోజుల్లో తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. ఇలాంటి సమయం లో ఈ కేసు విషయం నేడు చర్చ కు రావడం సంచలనం గా మారింది. కచ్చితంగా ఈ విడాకుల వ్యవహారం వోటింగ్ పై కచ్చితంగా ప్రభావం చూపిస్తుందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. సర్వేల ప్రకారం విజయ్ ఓటు బ్యాంకు 8 నుండి 12 శాతం వరకు ఉంటుంది. ఇలాంటి అంశాలన్నీ నెగెటివ్ ప్రభావం చూపిస్తే విజయ్ ఓటు బ్యాంకు పది శాతం కంటే తక్కువ ఉండొచ్చు.

ఇకపోతే విజయ్ ఎన్నికల ప్రచారం లో ఏ రేంజ్ లో దూసుకుపోతున్నాడో మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. మిట్ట మధ్యాహ్నం కూడా ఆయన్ని చూసేందుకు జనాలు ఎండల్లో పడిగాపులు కాస్తున్నారు. సాధారణంగా వేరే రాజకీయ పార్టీ నాయకులకు డబ్బులు ఇస్తే కానీ జనం రాలేని పరిస్థితి , కానీ విజయ్ సినిమా హీరో అవ్వడం తో, డబ్బులు అవసరం లేకుండానే ఆయన సభలకు జనాలు పోటెత్తున్నారు. రేపటి తో తమిళనాడు లో ఎన్నికల ప్రచారం ముగియనుంది. చూడాలి మరి ఎన్నికల ముందు రోజు విజయ్ తన క్యాడర్ ని ఎలెక్షనీరింగ్ విషయం లో ఎలాంటి దిశా నిర్దేశాలు చేస్తాడు అనేది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version