క్వారంటైన్ పై కేసీఆర్ కీలక నిర్ణయం!

తెలంగాణాలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కరోనా కట్టడి కోసం కీలక నిర్ణయం తీసుకుంది. హోం క్వారంటైన్ గడువు ప్రస్తుతం 14 రోజులు ఉండగా, దానిని 28 రోజులకు పొడిగిస్తూ కేసీఆర్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. కాగా.. కేవలం ప్రైమరీ కాంటాక్టులపై కోవిద్-19 టెస్ట్ చేయాలని అధికారులకు సూచించింది. తాజాగా తెలంగాణలో కరోనా బాధితుల సంఖ్య 928కి చేరింది. భారత్ లోని కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కొన్ని ఆసక్తికర […]

Written By: Neelambaram, Updated On : April 22, 2020 4:41 pm
Follow us on

తెలంగాణాలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కరోనా కట్టడి కోసం కీలక నిర్ణయం తీసుకుంది. హోం క్వారంటైన్ గడువు ప్రస్తుతం 14 రోజులు ఉండగా, దానిని 28 రోజులకు పొడిగిస్తూ కేసీఆర్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. కాగా.. కేవలం ప్రైమరీ కాంటాక్టులపై కోవిద్-19 టెస్ట్ చేయాలని అధికారులకు సూచించింది. తాజాగా తెలంగాణలో కరోనా బాధితుల సంఖ్య 928కి చేరింది.

భారత్ లోని కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కొన్ని ఆసక్తికర విషయాలు తెరపైకి వస్తున్నాయి. క్వారంటైన్ పీరియడ్ విషయంలో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలలో కరోనా లక్షణాలు బయటపడటానికి 14 నుంచి 28 రోజుల సమయం పడుతుంది. దింతో చాలా రాష్ట్రాలు క్వారంటైన్ పీరియడ్ ని 28 రోజులకు పొడిగించనున్నాయి.

వైరస్ సోకిన వారిలో వ్యాధి లక్షణాలు కనిపించడానికి 14 రోజులకంటే ఎక్కువ సమయం పడుతుందని ఐసీఎంఆర్ నిర్ధారించింది. దాదాపు 250 పట్టణాల్లో ఓ అధ్యయనం చేసి, వైరస్ సోకినవారిలో 70 శాతం మందికి 10 నుంచి 18 రోజుల తర్వాతే లక్షణాలు కనబడుతున్నాయని తేల్చింది. కొందరు పేషెంట్లలో 17 22 31 35 రోజుల తర్వాత కూడా లక్షణాలు బయటపడుతున్నాయని మరికొన్ని అధ్యయనాల్లో తేలింది.