Liger- Distributor Warangal Srinu: టాక్ తో సంబంధం లేకుండా మొదటి నుండే లైగర్ చిత్రాన్ని టార్గెట్ చేసినట్లు డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను వెల్లడించారు. ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమాను ఎలా తొక్కేశారో వివరించారు. వరంగల్ శ్రీను మాట్లాడుతూ… పరిశ్రమలో ఇప్పుడు ఓ అనారోగ్య పూరిత వాతావరణం నెలకొంది. కొందరు దర్శక నిర్మాతలను పరిశ్రమ నుండి బహిష్కరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కక్ష సాధింపు చర్యల్లో భాగంగా కొందరి సినిమాలను కావాలనే దెబ్బతీస్తున్నారు. లైగర్ విషయంలో అదే జరిగింది.

సినిమా విడుదలకు ముందు నుంచే నెగిటివ్ ప్రచారం మొదలుపెట్టారు. రోజుకో తప్పుడు ప్రచారం చేశారు. సినిమా బాగుంది బాగాలేదు అని చెప్పడం వరకూ ఓకే. కానీ లైగర్ చిత్రాన్ని పనిగట్టుకొని కొందరు దెబ్బతీశారు. దీని వలన పరిశ్రమలో దర్శక నిర్మాతలు తగ్గిపోతారు. తక్కువ సినిమాలు తెరకెక్కుతాయి. పరిశ్రమపై ఆధారపడిన వేలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోతారని ఆయన అన్నారు. ఇక లైగర్ మూవీలో చివరి 7-10 నిమిషాలు ఆకట్టుకునేలా లేదు. సినిమాకు తగిన ముగింపు లేదు. దాని వలన ఫలితం దెబ్బతింది, అన్నారు.
కాగా ఆచార్య, లైగర్ చిత్రాలతో తాను రూ. 100 కోట్ల వరకు నష్టపోయానని వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆయన చెప్పుకొచ్చారు. పెద్ద మొత్తంలో కోల్పోయింది మాత్రం నిజం అన్నారు. ఇక కొన్నాళ్లుగా దిల్ రాజు, వరంగల్ శ్రీను మధ్య డిస్ట్రిబ్యూషన్ వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. దిల్ రాజుకు పోటీగా ఎదిగే ప్రయత్నం వరంగల్ శ్రీను చేస్తుండగా అడ్డుకుంటున్నాడనే ఆరోపణలు ఉన్నాయి.అప్పట్లో హిట్ మూవీ క్రాక్ కి థియేటర్స్ ఇవ్వకుండా ప్లాప్ అయిన డబ్బింగ్ మూవీని దిల్ రాజు ఆడిస్తున్నాడంటూ ఆరోపణలు చేశారు. ప్రెస్ మీట్ పెట్టి మరీ విమర్శలు చేయడం జరిగింది.

లైగర్ తెలుగు రాష్ట్రాల హక్కులను వరంగల్ శ్రీను దాదాపు రూ. 60 కోట్లు పెట్టి కొన్నారు. అందులో కేవలం 30-35% మాత్రమే రికవరీ అయ్యింది.ఓవర్సీస్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లో లైగర్ రెండో రోజుకే చేతులు ఎత్తేసింది. అత్యధిక ధరలు చెల్లించి లైగర్ హక్కులు కొన్న బయ్యర్లు దర్శకుడు పూరి జగన్నాధ్ ని ఒత్తిడి చేస్తున్నారు. నష్టాల లెక్కలు వివరించి కొంత తిరిగి చెల్లించాలని డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం అందుతుంది.
https://www.youtube.com/watch?v=6AoeUJSSVKQ

[…] […]