Katrina Kaif- Vicky Kaushal: బాలీవుడ్ లవ్ బర్డ్స్ కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ గతేడాది గుజరాత్‌లో గ్రాండ్‌గా పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పెళ్లి ఆ సమయంలో పెద్ద షాకింగ్ విషయం. కారణం.. తనకు పెళ్లి జరిగే వరకు కత్రినా ఈ విషయాన్ని ఎక్కడా బయట పెట్టలేదు. బయటకు వచ్చిన మ్యాటర్ ను కూడా పుకార్లు అంటూ బాగా మ్యానేజ్ చేసింది. మొత్తానికి పెళ్లి తర్వాతే, తమ పెళ్లి ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు ఈ జంట. దాంతో అభిమానులు కత్రినా పెద్ద కంత్రి అంటూ విరుచుకు పడ్డారు. అసలు సీక్రెట్ గా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏముంది ? అంటూ పెద్ద రాద్ధాంతమే చేశారు.

అయితే, తాజాగా కత్రినా తాను ఎందుకు సీక్రెట్ గా పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో క్లారిటీ ఇచ్చింది. కరోనా వల్లే మా పెళ్లి గురించి ఎవరికీ చెప్పలేదు. ఆ సమయంలో కోవిడ్‌తో మా కుటుంబం చాలా ఇబ్బంది పడింది, అందుకే మేం రహస్యంగా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అంటూ కత్రినా పేర్కొంది. ప్రస్తుతం కత్రినా కామెంట్స్ బాగా వైరల్ అవుతున్నాయి. అలాగే ఈ బాలీవుడ్ అందాల హీరోయిన్ తల్లి కాబోతుందని వస్తున్న రూమర్స్ పై కూడా కత్రినా స్పందించింది.
Also Read: Balakrishna: రెస్టారెంట్ కు వెళ్లిన బాలయ్యలో మరో యాంగిల్ ఇదీ.. చూస్తారా?
ఈ వార్తలు పూర్తిగా గాసిప్ రాయుళ్లు చేసిన బాగోతం. అసలు అనవసరంగా నన్ను ఎందుకు గర్భవతిని చేస్తున్నారో నాకు అర్ధం కావడం లేదు. నేను ప్రెగ్నెంట్ అయిన విషయాన్ని నా భర్త సోషల్ మీడియాలో చూసి తెలుసుకుంటున్నారు. ఏ అమ్మాయి అయినా గర్భం దాల్చడాన్ని ఎంజాయ్ చేస్తోంది. కానీ.. నేను ఈ విషయంలో బాధ పడాల్సి వస్తోంది. అసలు నాకు ఇప్పటికి అర్థం కాని విషయం. నన్ను ఎంతమంది ఎన్నిసార్లు గర్భవతిని చేస్తారు?, నటిగా జీవితం మొదలు పెట్టిన రోజు నుంచి ఇప్పటికే ఎన్నోసార్లు గర్భవతిని చేశారు. చివరకు పెళ్లి అయ్యాక కూడా మళ్లీ ఇదే చేస్తున్నారు.

అసలు ఫలానా హీరోయిన్ ప్రెగ్నెంట్ అని మీడియా వాళ్లే ఎలా నిర్దారణ చేసేస్తున్నారు ?, దానికి రుజువు ఏమిటి ?, సరే పెళ్లి అయిన హీరోయిన్లు తల్లి కాబోతున్నారని వార్తలు పుట్టిస్తే.. అవి ఇంట్రెస్టింగ్ రూమర్లే అని సరిపెట్టుకోవచ్చు. కానీ, పెళ్లి కానీ హీరోయిన్ల పై ఇలాంటి వార్తలు పుట్టిస్తే వాళ్ళను ఏమనాలి ?, అందుకే.. ప్రేక్షకులు ఇలాంటి వాళ్ళను ఎంకరేజ్ చేయకూడదు. అప్పుడే నిజాలు తెలుస్తాయి.
మొత్తానికి ఈ 40 ఏళ్ల క్రేజీ హీరోయిన్ తల్లి కాబోతుంది అనే వార్త పై పెద్ద క్లాసే పీకింది. అసలు ఇంతకీ కత్రీనా కైఫ్ తల్లి కాబోతుంది అనే వార్త ఎలా పుట్టుకొచ్చింది అంటే.. రీసెంట్ గా కత్రీనా కైఫ్ ఎయిర్‌పోర్టులో కనిపించిన లుక్ సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది. ఆ పిక్ లో ఆమె ఉదర భాగం ఎత్తుగా కనిపిచింది. దాంతో సోషల్ మీడియాలో కత్రీనా ప్రెగ్నెంట్ అనే వార్త వైరల్ అయ్యింది.
ఈ క్రమంలో సీనియర్ హీరోల సినిమాల్లో అవకాశాలను అందుకుంటూ ముందుకు పోతుంది కత్రీనా కైఫ్. ఆ అందిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ వరుసగా సినిమాలు చేస్తోంది. మరి ఇప్పుడు తల్లి కాబోతుంది కాబట్టి ఇక సినిమాలకు గ్యాప్ ఇస్తోందేమో చూడాలి. అయితే ప్రస్తుతం కత్రీనా కైఫ్ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. ఒకవేళ ఆమె తల్లి కాబోతుంది అనేది నిజం అయితే.. మూడు నెలల లోపు ఈ సినిమాలు పూర్తి చేయాల్సి ఉంటుంది.
https://www.youtube.com/watch?v=6AoeUJSSVKQ
