Kingdom Teaser : విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘కింగ్డమ్'(Kingdom) టీజర్ నిన్న యూట్యూబ్ లో విడుదలై సెన్సేషన్ సృష్టించింది. వరుస ఫ్లాప్స్ తర్వాత విజయ్ దేవరకొండ నుండి ఈ రేంజ్ సాలిడ్ కంటెంట్ ని అభిమానులు కూడా ఊహించలేదు. మేకింగ్ పరంగా చాలా రిచ్ గా అనిపించినా ఈ టీజర్, సినిమా లో మంచి కంటెంట్ ఉంది అనే సిగ్నల్స్ ని ఆడియన్స్ కి అందించింది. ఈ చిత్రంతో విజయ్ దేవరకొండ కుంభస్థలాన్ని బద్దలు కొట్టబోతున్నాడు అనేది అందరికి స్పష్టంగా అర్థమైంది. ముఖ్యంగా ఈ టీజర్ ఇంత హైలైట్ అవ్వడానికి ప్రధాన కారణాలలో ఒకటి జూనియర్ ఎన్టీఆర్(Junior NTR) వాయిస్ ఓవర్. ‘దేవర’ చిత్రం తర్వాత ఎన్టీఆర్ నుండి విడుదలైన వాయిస్ ఓవర్ కావడంతో ఆయన అభిమానులు ఆతృతగా ఎదురు చూసారు. టీజర్ కి మంచి ప్రమోషన్ ని అందించారు.
ఇకపోతే ఈ టీజర్ కి 24 గంటల్లో 11 మిలియన్ కి పైగా వ్యూస్ వచ్చాయి. మీడియం రేంజ్ హీరోలలో ఇది ఒక ఆల్ టైం రికార్డు గా చెప్తున్నారు. అదే విధంగా లైక్స్ దాదాపుగా 3 లక్షల 30 వేల వరకు వచ్చాయి. ఇది కూడా రికార్డు అనొచ్చు. టీజర్ అంటే యాడ్స్ ద్వారా కొంత వ్యూస్ కలిసొచ్చాయని అనుకోవచ్చు, కానీ లైక్స్ ఈ రేంజ్ లో వచ్చాయంటే, కచ్చితంగా ఈ టీజర్ కి ఆడియన్స్ నుండి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచిన్నట్టే అనుకోవాలి. కేవలం తెలుగు లో మాత్రమే కాదు, హిందీ, తమిళం లో కూడా ఈ టీజర్ కి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. హిందీ లో 6 మిలియన్ కి పైగా వ్యూస్, 75 వేల లైక్స్ వచ్చాయి. లైక్స్ ని బట్టి చూస్తే అక్కడ కూడా ఈ టీజర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిందని చెప్పొచ్చు. హిందీ వెర్షన్ కి రణబీర్ కపూర్(Ranbhir Kapoor) వాయిస్ ఓవర్ అందించడం బాగా ప్లస్ అయ్యింది.
ఇక తమిళం లో అయితే ఈ టీజర్ కి కేవలం 24 గంటల్లో 4 మిలియన్ కి పైగా వ్యూస్ రాగా, 54 వేల లైక్స్ వచ్చాయి. హీరో సూర్య(Suriya Sivakumar) వాయిస్ ఓవర్ కారణంగా ఆయన అభిమానులు ఈ టీజర్ తమిళ వెర్షన్ కి మంచి ప్రొమోషన్స్ అందించారు. ఓవరాల్ గా ఈ టీజర్ కి మూడు భాషలకు కలిపి 22 మిలియన్ కి పైగా వ్యూస్ వచ్చాయి. ఇది మీడియం రేంజ్ హీరోల క్యాటగిరీలో బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఓవరాల్ గా చూస్తే పాన్ ఇండియా లెవెల్ లో మే 30 వ తారీఖున విడుదల అవ్వబోతున్న ఈ సినిమాకి బంపర్ వసూళ్లు వస్తాయని, మన టాలీవుడ్ నుండి విజయ్ దేవరకొండ మరో పాన్ ఇండియన్ స్టార్ గా అవతరిస్తాడని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.