Vijay Deverakonda And Sandeep Reddy Vang: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కానీ రీతిలో గొప్ప విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్లిన హీరోలు చాలామంది ఉన్నారు. ఇక అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా మారిపోయిన విజయ్ దేవరకొండ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన చేసిన ఆ సినిమాతో భారీ క్రేజ్ ని సంపాదించుకున్నాడు. ఇక ఆ తర్వాత అంత గొప్ప విజయాన్ని సాధించకపోయిన కూడా ఆయన టైర్ వన్ హీరోగా మారడానికి చాలా అవకాశాలైతే వస్తున్నాయి.
ఇక రీసెంట్ గా ఈ సంవత్సరం కింగ్డమ్ సినిమాతో ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోయిన కూడా విజయ్ దేవరకొండకి మంచి అవకాశాలైతే వస్తున్నాయి. ఇక ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఆయన సందీప్ రెడ్డివంగ ఈగో ను హార్ట్ చేశాడు అంటూ గతంలో కొన్ని వార్తలైతే వచ్చాయి. సినిమా మధ్యలో ఉన్నప్పుడు ఇది హిట్ అవుతుంది అంటావా అని సందీప్ ని విజయ్ అడిగారట.
ఆ విషయంలో కొంతవరకు కోపానికి వచ్చారట. నీకు సినిమా సక్సెస్ తో సంబంధం లేదు ముందు సినిమా చేయి సక్సెస్ అవుతుందా? లేదా అనేది తర్వాత అంటూ ఆయన విజయ్ మీద ఫైర్ అయినట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాత మళ్లీ వీళ్ళిద్దరు కలిసి పోయి ఆ సినిమాను చాలా బాగా చిత్రీకరించారు. మొత్తానికైతే ఈ సినిమా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచిందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…
ఇక ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేస్తున్నా కూడా సందీప్ రెడ్డి వంగ కి ఉన్న గుర్తింపు మరే దర్శకుడికి లేదనే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు చేస్తున్న సినిమాలు ఒక రేంజ్ లో ఉంటే సందీప్ రెడ్డివంగ చేస్తున్న సినిమాలు మరొక రేంజ్ లో ఉంటాయి. ఎందుకంటే ఆయన యూత్ ను అట్రాక్ట్ చేస్తూ కొన్ని బోల్ద్ సన్నివేశాలను కలిపి సినిమాని చిత్రీకరించి సూపర్ సక్సెస్ లను సాధిస్తాడు. అలాంటి దర్శకుడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మరొకరు ఉండరనేది వాస్తవం…