Pradeep Ranganathan: తమిళ్ సినిమా ఇండస్ట్రీ అనగానే రజినీకాంత్, కమల్ హాసన్, సూర్య, విక్రమ్ లాంటి నటులు గుర్తుకొస్తారు. వీళ్ళు తమ సినిమాలతో తమిళ్ ప్రేక్షకులను అలరించడమే కాకుండా తెలుగు ఆడియాన్స్ ను సైతం తమ వైపు తిప్పుకున్నారు. ఇక ఇలాంటి సందర్భంలోనే ఇక మీదట వాళ్ళు చేయబోతున్న సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇక వీళ్ళతో పాటుగా ప్రదీప్ రంగనాథన్ లాంటి యంగ్ హీరో సైతం మంచి సినిమాలు చేస్తూ ముందుకు దూసుకెళ్తుండడం విశేషం… ‘డ్రాగన్’ సినిమాతో 100 కోట్ల క్లబ్లో చేరిన ఆయన ఎవరికి సాధ్యం కానీ రీతిలో వరుస సక్సెస్ లను సాధిస్తున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోల కంటే కూడా ప్రదీప్ రంగనాథన్ చాలా బెటర్ అని ఆయనకి చాలా మంచి మార్కెట్ క్రియేట్ అయింది. ఆయన నుంచి ఒక సినిమా వస్తుంది అంటే చాలు ప్రేక్షకులు ఆ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇక ఇలాంటి సందర్భంలోనే ప్రదీప్ రంగనాథన్ హీరోగా అదరగొడుతున్నాడు… డ్యూడ్ సినిమాతో మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. ఒకరకంగా చెప్పాలి అంటే ప్రదీప్ రంగనాథన్ తో పోలిస్తే మన తెలుగు హీరోలు ఎందుకు పనికిరాకుండా పోతున్నారని మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. కారణం ఏంటంటే ఆయన చాలా తక్కువ బడ్జెట్లో యూత్ కి కనెక్ట్ అయ్యే కథలను ఎంచుకొని సినిమాలు చేస్తూ 100 కోట్ల కలెక్షన్లను కొల్లగొడుతున్నాడు.
యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఆయనకంటూ ఒక భారీ మార్కెట్ క్రియేట్ అయింది. తెలుగులో ఉన్న యంగ్ హీరోలైన శర్వానంద్, నితిన్ లాంటి హీరోల కంటే తను చాలా బెటర్ అని కొంతమంది సినిమా మేధావులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఇక ఎవ్వరు ఎలాంటి సినిమాలు చేసినా కూడా ఫైనల్ గా ఇక్కడ సక్సెస్ లు మాత్రమే మాట్లాడుతూ ఉంటాయి.
కాబట్టి ప్రదీప్ రంగనాథన్ చేసిన సినిమాలు ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. అలాంటి హీరో తెలుగులో ఉంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ కి కూడా చాలా మంచి పేరు వస్తుందని పలువురు సినిమా మేధావులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఇక తమిళ్ సినిమా ఇండస్ట్రీలో ప్రతి ప్రదీప్ రంగనాథన్ ను జూనియర్ ధనుష్ గా పిలుస్తున్నారు. ఒకప్పుడు ధనుష్ ఎలాంటి ఎక్స్పరిమెంటల్ సినిమాలు చేసేవాడు. ఇప్పుడు ప్రదీప్ రంగనాథన్ సైతం అలాంటి సినిమాలను చేస్తుండడం విశేషం…