మనసు మార్చుకున్న ‘కామ్రేడ్’

కెరీర్ ఆరంభంలో `ఎవడే సుబ్రహ్మణ్యం , పెళ్లి చూపులు `వంటి సున్నిత మైన కథలతో హీరోగా పేరు తెచ్చుకొన్న విజయ్ దేవరకొండ తరవాత ఎందుకో మాస్ చిత్రాల వెంట పడ్డాడు. అర్జున్ రెడ్డి ఇచ్చిన కిక్ తో తనని తాను మాస్ హీరోగా మార్చు కోవాలనుకొన్నాడు. ఆ క్రమం లో ` టాక్సీ వాలా , నోటా , డియర్ కామ్రేడ్ , వరల్డ్ ఫేమస్ లవర్ ` వంటి మాస్ అప్పీల్ ఉన్న చిత్రాలను చేయడం […]

Written By: admin, Updated On : April 21, 2020 3:47 pm
Follow us on

కెరీర్ ఆరంభంలో `ఎవడే సుబ్రహ్మణ్యం , పెళ్లి చూపులు `వంటి సున్నిత మైన కథలతో హీరోగా పేరు తెచ్చుకొన్న విజయ్ దేవరకొండ తరవాత ఎందుకో మాస్ చిత్రాల వెంట పడ్డాడు. అర్జున్ రెడ్డి ఇచ్చిన కిక్ తో తనని తాను మాస్ హీరోగా మార్చు కోవాలనుకొన్నాడు. ఆ క్రమం లో ` టాక్సీ వాలా , నోటా , డియర్ కామ్రేడ్ , వరల్డ్ ఫేమస్ లవర్ ` వంటి మాస్ అప్పీల్ ఉన్న చిత్రాలను చేయడం జరిగింది. కానీ ప్రేక్షకులు వాటిని ఆదరించి కుండా తిరస్కరించారు. ఇక్కడ ఇంకో విషయం విజయ్ దేవరకొండ మర్చి పోయాడు.

వైద్యులకు అండగా నిలిచిన జనసేనాని

` పెళ్లి చూపులు చిత్రం తో పాటు విజయ్ దేవరకొండ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచి 100 కోట్ల గ్రాస్ రాబట్టిన `గీత గోవిందం ` చిత్రం సున్నిత మైన లవ్ నేపధ్యం లోనే రూపొంది ఘన విజయం సాధించాయి. దరిమిలా కొంతకాలం పాటు లవ్ జానర్ లోనే చిత్రాలు చేస్తే అది కెరీర్ కి గట్టి పునాది అయ్యేది. ఆ విషయం మర్చి పోయి తనని తాను ఎక్కువ ఊహించు కొని మాస్ చిత్రాలు చేస్తున్నాడు. ఇపుడు మళ్ళీ ఎవరు సలహా ఇచ్చారో ఏమో సున్నితమైన లవ్ స్టోరీ లను చక్కగా చిత్రీకరించే ఒక యువ దర్శకుడి చిత్రం లో నటించేందుకు సిద్దమౌతున్నాడు.

కరోనా టెస్ట్ ల వివాదంలో జగన్ ప్రభుత్వం!

` డియర్ కామ్రేడ్ ,, వరల్డ్ ఫేమస్ లవర్ `వంటి వరుస పరాజయాలతో ఖంగుతిన్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఫైటర్ గా నటిస్తున్నాడు. ఫుల్ మాస్ అప్పీల్ ఉన్న పాత్రలో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకో బోతున్నాడు. కాగా ఈ చిత్రం తరవాత తనకు అచ్చివచ్చిన సాఫ్ట్ లవ్ జానర్లో మరో చిత్రం చేయబోతున్నాడు. ఆ క్రమంలో విజయ్ దేవరకొండ తన తదుపరి చిత్రాన్ని దిల్ రాజు బ్యానర్ లో చేయనున్నాడు.` నిన్ను కోరి `, ` మజిలీ `వంటి సాఫ్ట్ లవ్ స్టోరీస్ తీసి సూపర్ హిట్ విజయాలను అందుకొన్న దర్శకుడు శివ నిర్వాణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తాడు……అని తెలిసింది. ప్రస్తుతం నాని తో ‘టక్ జగదీశ్’ చిత్రాన్ని రూపొందిస్తున్న శివ నిర్వాణ తన తదుపరి ప్రాజెక్ట్ గా విజయ్ దేవరకొండ చిత్రాన్ని ఎన్నిక చేసుకున్నట్టు తెలుస్తోంది.