
ప్రస్తుతం కోవిడ్ 19 కారణంగా సినీ ప్రపంచమంతా గందర గోళంగా తయారైంది. విడుదల కావాల్సిన పలు చిత్రాలు ఆగిపోయాయి. ఆంధ్ర ప్రదేశ్ లో మే 3 వరకు లాక్‌డౌన్ ఉంటే.. మే 7 వరకు తెలంగాణ లో లాక్‌డౌన్ కొనసాగనుంది.. అలాంటి సమయం లో సినీ పరిశ్రమ పలు ఇబ్బందులను ఎదుర్కొంటుంది .ఇప్పటికే మార్చి మూడో వారం నుండి విడుదల కావాల్సిన పలు సినిమాలు ఆగిపోయాయి. ]అవి ఎప్పటికి విడుదలవుతాయో అంతుపట్టకుండా వుంది .
ఒకవేళ లాక్‌డౌన్‌ను ఎత్తేసిన తరవాత థియేటర్స్ ఓపెన్ చేయడానికి ప్రభుత్వాలు వెంటనే అనుమతినిస్తాయా అనేది సందేహమే ఇదే విషయం ఫై సీనియర్ నిర్మాత దగ్గుబాటి సురేష్ మాట్లాడుతూ .సినిమా థియేటర్లు పూర్వ స్థితికి వచ్చి ప్రేక్షకులతో కళ కళ లాడాలంటే డిసెంబర్ దాకా ఆగాల్సి వస్తుంది అన్నారు . దరిమిలా ఈ పరిస్థితిని అధిగమించాలంటే ఏం చేయాలని సినీ పరిశ్రమలోని పెద్దలు ఆలోచన లో పడ్డారు .. ఇప్పుడు ఆగిపోయిన సినిమాలకు భవిష్యత్తులో థియేటర్స్ ప్రాబ్లమ్ రాకుండా ఆలోచన చేస్తున్నారు. ఆ క్రమంలో డబ్బింగ్ సినిమాలను ఇప్పట్లో విడుదల చేయకుండా ఆపాలని అనుకుంటున్నారట .. దీంతో కొంత మేర థియేటర్స్ సమస్య తగ్గే అవకాశం ఉంటుందని నమ్ముతున్నారు . ఆ దిశగా పావులు కదుపు తున్నారు. ఒకవేళ ఇది నిజమైతే అనువాద చిత్రాలకు అనూహ్యంగా అడ్డుకట్ట పడబోతోంది. సదరు డబ్బింగ్ సినిమాల నిర్మాతలకు ఈ నిర్ణయం ఆశనిపాతం కాబోతుంది .