Kingdom Movie Slang Issue: తెలుగు సినిమా ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండ కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఆయన చేసిన సినిమాలు విజయాలను సాధించడమే కాకుండా ఆయనకంటూ ఒక సెపరేట్ ఐడెంటిటిని క్రియేట్ చేసి పెట్టాయి. ముఖ్యంగా పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి లాంటి సినిమాల్లో తెలంగాణ స్లాంగ్ తో అదరగొట్టిన ఆయన ఆ తర్వాత చేసిన సినిమాల్లో మాట్లాడడానికి తీవ్రమైన ప్రయత్నం అయితే చేశాడు. మరి ఇప్పుడు మాత్రం ఆయన కింగ్డమ్ సినిమాలో తెలంగాణ యాస మాట్లాడడానికి చాలా ఇబ్బంది పడ్డాడు. దానికి కారణం ఏంటి? బేసిగ్గా విజయ్ తెలంగాణ యాస చాలా అద్భుతంగా మాట్లాడుతాడు. మరి అలాంటిది ఇందులో ఆ యాస మాట్లాడడానికి కూడా ఇబ్బంది పడుతున్నట్టుగా ఎందుకలా మాట్లాడాడు. డైరెక్టర్ కావాలని అతని చేత అలా మాట్లాడించాడా? సినిమాలో ఆయన మాట్లాడిన తెలంగాణ యాస పర్ఫెక్ట్ గా ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతోంది. మరి ఇందులో మాత్రం ఎందుకు ఆయన అలాంటి ఒక టిపికల్ స్లాంగ్ లో మాట్లాడడానికి ట్రై చేశాడు. అది కొత్తగా ఉంటుందని అనుకుంటున్నారా? లేదంటే తెలంగాణ స్లాంగ్ ని నాశనం చేయాలనే ఉద్దేశ్యంతో అలా మాట్లాడించారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి…
Also Read: రామ్ చరణ్ పెద్ది మూవీ.. 2000 మంది తో.. ఏంటీ అరాచకం..?
విజయ్ దేవరకొండ ఈ సినిమాలో చాలా డల్ గా కనిపిస్తాడు. ఏ ఒక్క సీన్లో కూడా హై పర్ఫామెన్స్ అయితే ఇవ్వలేకపోయాడు. దానికి తోడుగా ఆయన మాట్లాడిన ప్రతి మాట వినడానికి కూడా ఇబ్బంది కలిగించేలా ఉంది. పర్ఫెక్ట్ తెలంగాణ యాసలో మాట్లాడినందుకే విజయ్ ని చాలామంది ఓన్ చేసుకున్నారు.
మరి అలాంటిది ఆయనే తెలంగాణ యాస మాట్లాడడానికి ఇబ్బంది పడుతుంటే ఎందుకు ఇలా చేశారు అనే ఒక డౌట్ అయితే ప్రతి ఒక్కరిలో కలుగుతోంది. గౌతమ్ తిన్ననూరి ఈ సినిమా మీదనే కాకుండా విజయ్ యాస మీద కూడా పెద్దగా దృష్టి పెట్టినట్టుగా అనిపించలేదు. ఏదో రాండం గా ఆయన మాట్లాడిన కొన్ని మాటలు ఆకట్టుకునే ప్రయత్నం అయితే చేశాయి.
Also Read: మహేష్ బాబు – రాజమౌళి మూవీలో ఆ ఒక్క సీన్ హైలెట్ అంట..!
నిజానికి ఇందులో ఒక్క డైలాగ్ కూడా పర్ఫెక్ట్ గా ప్రేక్షకుల్ని హుక్ చేసే విధంగా లేకపోవడం అనేది సినిమాకి భారీగా మైనస్ గా మారింది. ఈయన చేస్తున్న ఈ సినిమా విషయంలో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకుని ఉంటే గౌతమ్ తిన్న నూరి టాప్ డైరెక్టర్ గా ఎదిగేవాడు. కానీ సినిమా కోసం ఆయన ఏమాత్రం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోనట్టుగా తెలుస్తోంది…