Kingdom movie first day box office collection: విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘కింగ్డమ్'(Kingdom Movie) నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలై డివైడ్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ హాఫ్ వరకు పాజిటివ్ రిపోర్ట్స్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రం, సెకండ్ హాఫ్ విషయం లో మాత్రం చాలా దారుణమైన టాక్ ని సొంతం చేసుకుంది. కానీ విడుదలకు ముందు ఈ సినిమాకు భారీ హైప్ ఉండడం వల్ల, ఓపెనింగ్స్ వరకు అదిరిపోయాయి, కానీ సినిమా పొటెన్షియాల్ రేంజ్ కి తగ్గ ఓపెనింగ్ కాదు. ప్రమోషనల్ కంటెంట్ ని చూస్తే వేరే లెవెల్ క్వాలిటీ తో ఉంది. ఆ క్వాలిటీ కి తగ్గ ఓపెనింగ్ మాత్రం రాలేదు. మిడ్ వీక్ విడుదల, దానికి తోడు డివైడ్ టాక్ ప్రభావం కాస్త సినిమాపై పడి ఉండొచ్చు. ప్రాంతాల వారీగా GST తో కలిపి ఈ సినిమాకు ఎంత ఓపెనింగ్ వచ్చిందో ఒకసారి చూద్దాము.
Also Read: కింగ్డమ్ లో విజయ్ తెలంగాణ స్లాంగ్ మాట్లాడటానికి ఇబ్బంది పడ్డాడా..? కారణం ఏంటి..?
నైజాం ప్రాంతం లో ఈ చిత్రానికి 4 కోట్ల 96 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. మీడియం రేంజ్ హీరోల సినిమాల్లో ఆల్ టైం రికార్డు ని నెలకొల్పుతుందని అనుకుంటే, ‘హిట్ 3 ‘, ‘దసరా’ ఓపెనింగ్ కి దరిదాపుల్లో కూడా రాలేకపోయింది. ఇక సీడెడ్ విషయానికి వస్తే మొదటి రోజున ఈ చిత్రం కోటి 70 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇక్కడ మాత్రం భారీ ఓపెనింగ్ అనొచ్చు. అదే విధంగా ఉత్తరాంధ్ర లో కూడా ఈ సినిమాకు మంచి వసూళ్లే వచ్చాయి. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఆ ప్రాంతం నుండి ఈ చిత్రానికి కోటి 36 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. తూర్పు గోదావరి జిల్లా నుండి 87 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లా నుండి 52 లక్షలు, గుంటూరు జిల్లా నుండి 88 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.
Also Read: కింగ్డమ్ మూవీ ఎక్కడ తేడా కొట్టిందంటే..?
అదే విధంగా కృష్ణ జిల్లాలో 69 లక్షలు, నెల్లూరు జిల్లాలో 40 లక్షల రూపాయిల ఓపెనింగ్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి 11 కోట్ల 38 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అన్ని ప్రాంతాల్లోనూ GST రిటర్న్స్ కలిపారు. కానీ సోషల్ మీడియా లో వినిపిస్తున్న ఆరోపణ ఏమిటంటే, GST కి మరో GST కలిపారని, ఇది నిర్మాత ఆడుతున్న ఫేక్ డ్రామా అని అంటున్నారు. గతం లో నిర్మాత నాగవంశీ ఎన్టీఆర్ దేవర విషయం లో కూడా ఇదే చేసాడు. తెలుగు రాష్ట్రాల సంగతి కాసేపు పక్కన పెడితే, ఓవర్సీస్ లో మాత్రం ఈ సినిమా స్టార్ హీరో రేంజ్ ఓపెనింగ్ ని సొంతం చేసుకుంది. ఒక్క నార్త్ అమెరికా లోనే దాదాపుగా 1 మిలియన్ డాలర్ గ్రాస్ వచ్చింది. ఓవరాల్ వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి 18 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.