Vijay Devarakonda -Ram Charan
Vijay Devarakonda : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan) ప్రముఖ యంగ్ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) పాలిట అదృష్ట దేవుడిగా మారబోతున్నాడా అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు. రామ్ చరణ్ వదిలేసిన సినిమాలన్నీ విజయ్ దేవరకొండ ఒడిసి పట్టుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన అంశం. ‘గేమ్ చేంజర్'(Game Changer Movie|) మూవీ షూటింగ్ జరుగుతున్న సమయంలో ‘జెర్సీ’ ఫేమ్ గౌత తిన్ననూరి రామ్ చరణ్ ని కలిసి ఒక స్టోరీ ని వినిపించాడట. కానీ రామ్ చరణ్ తన ఫోకస్ మొత్తాన్ని ‘గేమ్ చేంజర్’ చిత్రం పైనే ఉంచడంతో ఈ చిత్రాన్ని రిజెక్ట్ చేయాల్సి వచ్చింది. ఇదే చిత్రం విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్'(Kingdom Movie) పేరుతో ఇప్పుడు చేస్తున్నాడు. రీసెంట్ గానే ఈ సినిమా టీజర్ విడుదలై ఎంతటి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుందో మనమంతా చూసాము. రామ్ చరణ్ ఇలాంటి సినిమాని మిస్ అయ్యాడా?, చాలా కాస్ట్లీ మిస్ అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
అదే విధంగా రీసెంట్ గానే రామ్ చరణ్, కిల్ మూవీ డైరెక్టర్ నిఖిల్ నగేష్ భట్ దర్శకత్వం లో ఒక మైథాలజీ నేపథ్యంలో ఒక సినిమా చేయబోతున్నాడని బాలీవుడ్ మీడియా నుండి ఒక వార్త వచ్చింది. అయితే రామ్ చరణ్ తన ప్రస్తుత ద్రుష్టి మొత్తాన్ని బుచ్చి బాబు తో చేయబోయే సినిమా కోసం, అదే విధంగా సుకుమార్ తో చేయబోయే సినిమా కోసమే కేటాయించాడని, ఈ రెండు సినిమాలు పూర్తి అయ్యాకనే చరణ్ మరో సినిమా పై ద్రుష్టి పెడతాడని, అప్పటి వరకు కేవలం ఈ రెండు సినిమాలే తన ప్రపంచమని చెప్పుకొచ్చాట. నిఖిల్ నగేష్ భట్ మంచి కథని రామ్ చరణ్ కి వినిపించినప్పటికీ, కొంతకాలం ఆగమని రామ్ చరణ్ చెప్పాడట.. అన్ని రోజులు ఎదురు చూడలేక, ఈ క్రేజీ ప్రాజెక్ట్ రామ్ చరణ్ చేతుల మీద నుండి విజయ్ దేవరకొండ కి వెళ్లినట్టు సమాచారం.
మరి విజయ్ దేవరకొండ రామ్ చరణ్ వదిలేసిన ఈ రెండు సినిమాలను విడుదల చేసి సూపర్ హిట్స్ అందుకొని లక్కీ అనిపించుకుంటాడా?, లేకపోతే అనవసరంగా ఈ సినిమా చేసాడురా బాబు అని అనిపించుకుంటాడా అనేది చూడాలి. ‘లైగర్’, ‘ఖుషి’, ‘ది ఫ్యామిలీ స్టార్’ వంటి ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ చిత్రాల తర్వాత విజయ్ దేవరకొండ మార్కెట్ కాస్త తగ్గింది. ఇప్పుడు కింగ్డమ్ చిత్రం ఆయన పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేలాగానే అనిపిస్తుంది.