Akkineni Akhil : అక్కినేని అఖిల్(Akkineni Akhil) గత ఏడాది నవంబర్ 26 వ తారీఖున జైనాబ్ రవజీ(Zainab Ravdjee) అనే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. వీళ్ళ నిచితార్థం జరిగిన మరుసటి నెలలో అక్కినేని నాగ చైతన్య(Akkineni Naga chaitanya), శోభిత ధూళిపాళ్ల(Sobhita Dhulipala) వివాహం జరిగింది. ఒకే సమయంలో పెద్దగా గ్యాప్ లేకుండా తన ఇద్దరి కొడుకుల వివాహాలను ప్లాన్ చేసాడు అక్కినేని నాగార్జున. గతంలో కూడా అంతే, సమంత, నాగచైతన్య నిశ్చితార్థం జరిగిన కొన్ని రోజులకే అఖిల్, శ్రేయ భూపాల్ లకు నిశ్చితార్థం జరిపించింది. నాగచైతన్య, సమంతల వివాహం అయితే సాఫీగా జరిగిపోయింది కానీ, అఖిల్, శ్రేయ భూపాల్ వివాహం మాత్రం కుటుంబ సభ్యుల మధ్య ఏర్పడిన కొన్ని విబేధాల కారణంగా రద్దు అయ్యింది. దీంతో మళ్ళీ పెళ్లి గురించి ఆలోచించకుండా, కేవలం తన సినీ కెరీర్ పై ఫోకస్ పెట్టాడు అక్కినేని అఖిల్. కానీ ఎప్పుడైతే ఆయన జైనాబ్ ని పెళ్లాడబోతున్నానని సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించాడో, అభిమానులు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు.
నిజమైన సర్ప్రైజ్ అంటే ఇదేనంటూ కొనియాడారు. ఇకపోతే అఖిల్ వివాహాన్ని వచ్చే నెల 24 వ తారీఖున జరిపించడానికి సన్నాహాలు చేస్తున్నారట. వీళ్లిద్దరి వివాహం కూడా అన్నపూర్ణ స్టూడియోస్ లోనే జరగనుంది. తన తండ్రి గారిని అదే స్టూడియోస్ లో ఖననం చేసారు కాబట్టి, అక్కడే తన ఇద్దరి కొడుకుల వివాహాలను జరిపిస్తే తన తండ్రి ఆశీస్సులు ఉంటాయని నాగార్జున నమ్మకం అట. అందుకే ఇలా ప్లాన్ చేసాడు. ఈ వివాహ వేడుకకు కేవలం తనకి అత్యంత సన్నిహితులైన వారినే ఆహ్వానిస్తున్నారట నాగార్జున. అంతే కాకుండా బందు మిత్రులు కూడా ఈ పెళ్లి వేడుకలో పాల్గొనబోతున్నారు. ఇదంతా పక్కన పెడితే అప్పుడే అక్కినేని కుటుంబం లో పెళ్లి కళ కనిపిస్తుందని అభిమానులు సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు. రీసెంట్ గానే అఖిల్, జైనాబ్ కలిసి విమానాశ్రయంలో కనిపించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.
పెళ్లి కోసం ఇద్దరు కలిసి విదేశాలకు షాపింగ్ కి వెళ్లారని, అందుకే ఈ కీలక సమయంలో వాళ్లిద్దరూ అలా కనిపించారంటూ సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు. ఇక అక్కినేని అఖిల్ విషయానికి వస్తే, బాబు కి రీ లాంచ్ లు తప్ప, ఇప్పటి వరకు ఒక్క సక్సెస్ కూడా రాకపోవడం బాధాకరం. అక్కినేని కుటుంబం నుండి భారీ అంచనాల నడుమ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన హీరో ఈయన. తొలి సినిమాతో స్టార్ హీరో రేంజ్ ఓపెనింగ్ ని అందుకున్నాడు. కానీ రెండవ సినిమా నుండి ఆయన అభిమానుల అంచనాలను అందుకోలేకపోయాడు. చేసిన ప్రతీ సినిమా ఫ్లాపే. మధ్యలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే సినిమా ఒక్కటే పర్వాలేదు అనే రేంజ్ లో ఆడింది. ఆ తర్వాత భారీ అంచనాల నడుమ విడుదలైన ఏజెంట్ చిత్రం ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా మిగిలింది. కనీసం పెళ్లి తర్వాత అయినా అఖిల్ జాతకం మారుతుందో లేదో చూడాలి.