పైగా ఈ ఫైట్ సినిమా కథనే మలుపు తిప్పుతుంది. కీలకమైన ఎమోషనల్ సన్నివేశం కూడా ఈ ఫైట్ సీక్వెన్స్ లోనే ఉండబోతుంది. ఇక ఈ సినిమా షూటింగ్ మొదలైందంటూ విజయ్ దేవరకొండ లొకేషన్ లో కూర్చున్న ఫోటోని ఈ చిత్ర నిర్మాత ఛార్మి షేర్ చేసింది. విజయ్ కూర్చున్న తీరు, విజయ్ ఫిజిక్ ను చూస్తుంటే ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ ఏ రేంజ్ లో కష్టపడుతున్నాడో అర్ధమవుతుంది.
వచ్చే నెలలో ఈ సినిమా షూటింగ్ మొత్తాన్ని పూర్తి చెయ్యాలని పూరి ప్లాన్ చేశాడు. నిజానికి ఎప్పుడో పూర్తి కావాల్సిన ఈ సినిమా షూటింగ్ గత రెండేళ్లుగా కరోనా కారణంగా పోస్ట్ ఫోన్ అవుతూనే వచ్చింది. కానీ, ఈ సారి గ్యాప్ లేకుండా షూట్ ను ప్లాన్ చేస్తున్నాడు పూరి. ఇక ‘లైగర్’ సినిమాని డిసెంబర్ లో విడుదల చేయాలనేది ప్లాన్.
కానీ అది ఎంతవరకు సాధ్యం అవుతుందో చూడాలి. అన్నట్టు విజయ్ దేవరకొండ ఈ సినిమాతో బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇస్తున్నాడు. పైగా ఈ సినిమా కోసం విజయ్ కష్టపడి సిక్స్ ప్యాక్ చేశాడు. మరి ఆ కష్టానికి ఫలితం దక్కుతుందో లేదో చూడాలి. బాలీవుడ్ అగ్ర నిర్మాత కరణ్ జోహార్, ఛార్మి, పూరి జగన్నాధ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.