Vijay Deverakonda-Rashmika : రష్మిక మందాన కెరీర్ పీక్స్ లో ఉంది. ఈ మధ్యకాలంలో ఆమె నటించిన ప్రతి చిత్రం బ్లాక్ బస్టర్. యానిమల్, పుష్ప 2, చావా వందల కోట్ల వసూళ్లు రాబట్టాయి. నేషనల్ వైడ్ ఫేమ్ రాబట్టిన రష్మిక మందాన చేతిలో భారీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. తాజాగా విజయ్ దేవరకొండతో చిత్రానికి ఆమె సైన్ చేశారనే న్యూస్ పరిశ్రమలో చక్కర్లు కొడుతుంది. విజయ్ దేవరకొండ-రష్మికలది హిట్ కాంబినేషన్. వీరు జంటగా నటించిన గీత గోవిందం డబుల్ బ్లాక్ బస్టర్ అని చెప్పాలి. దర్శకుడు పరుశురాం తెరకెక్కించిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ నిర్మాతలకు పెద్ద మొత్తంలో లాభాలు తెచ్చిపెట్టింది.
Also Read: రోలెక్స్ కోసం సూర్య ఫ్యాన్స్ వెయిటింగ్, లోకేష్ కనకరాజ్ ఏమన్నారంటే?
అనంతరం డియర్ కామ్రేడ్ మూవీలో మరోసారి జతకట్టారు. ఈ మూవీకి మిశ్రమ స్పందన దక్కింది. విజయ్ దేవరకొండతో రష్మిక కెమిస్ట్రీ మాత్రం అదుర్స్. ప్రేక్షకులు ఎంజాయ్ చేశారు. వీరి కాంబోలో మూవీ వచ్చి చాలా కాలం అవుతుంది. కాగా టాక్సీవాలా, శ్యామ్ సింగరాయ్ చిత్రాల దర్శకుడు రాహుల్ సంకీర్త్యన్ తో మైత్రీ మూవీ మేకర్స్ ఓ మూవీ ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ని ఉద్దేశిస్తూ #HMMletssee ఆమె హ్యాష్ ట్యాగ్ జోడించి రష్మికను ట్యాగ్ చేశారు. ఈ ప్రాజెక్ట్ తాను చేస్తున్నట్లు రష్మిక క్లారిటీ ఇచ్చింది.
రాహుల్ సంకీర్త్యన్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ చేయనున్న మూవీ గురించే మైత్రీ మూవీ మేకర్స్ హింట్ ఇచ్చారు. విజయ్ దేవరకొండ-రష్మిక కాంబోలో చిత్రం వస్తుంది అంటూ టాలీవుడ్ లో వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు రష్మిక-విజయ్ దేవరకొండ ప్రేమలో ఉన్నట్లు చాలాకాలంగా పుకార్లు ఉన్నాయి. వీరు తరచుగా కలిసి వెకేషన్ కి వెళతారు. పెళ్ళైన జంట వలె విహారాలు ఎంజాయ్ చేస్తారు. విజయ్ దేవరకొండ ఇంట్లో జరిగే చిన్న చిన్న వేడుకలకు కూడా రష్మిక హాజరు అవుతుంది.
విజయ్ తో బంధం పై రష్మికను పలుమార్లు ప్రశ్నించినా స్పష్టత ఇవ్వలేదు. కలిసి వెకేషన్ కి వెళతాం అని మాత్రం చెప్పింది. మిత్రుడితో వెకేషన్ కి వెళితే తప్పేంటి అని రష్మిక గతంలో అన్నారు. విజయ్-రష్మిక ప్రేమలో ఉన్నారనేది నిజం. ఏదో ఒక రోజు సడన్ గా ప్రకటిస్తారనే వాదన బలంగా వినిపిస్తుంది. కెరీర్ పరంగా ఇద్దరూ చాలా బిజీగా ఉన్నారు. నెక్స్ట్ కింగ్ డమ్ మూవీతో విజయ్ దేవరకొండ ప్రేక్షకులను పలకరించనున్నాడు.