Surya Rolex : చేసింది తక్కువ చిత్రాలే అయిన టాలెంటెడ్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు లోకేష్ కనకరాజ్. లోకేష్ కనకరాజ్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా ఖైదీ, విక్రమ్, లియో తెరకెక్కాయి. ఈ మూడు చిత్రాలు భారీ విజయాలు అందుకున్నాయి. ఖైదీ ట్రెండ్ సెట్టర్ అని చెప్పాలి. ఒక నైట్ లో జరిగే కథను అద్భుతమైన స్క్రీన్ ప్లే తో లోకేష్ కనకరాజ్ అద్భుతంగా నడిపించారు. కార్తీ నటించిన ఖైదీ చిత్రానికి లోకేష్ కనకరాజ్ కి విపరీతమైన ప్రశంసలు దక్కాయి.
Also Read : మహేష్ బాబు తర్వాత నానినే, బడా స్టార్స్ కూడా ఆయన వెనకే!
LCU లో వచ్చిన రెండో చిత్రం విక్రమ్. కమల్ హాసన్ హీరోగా నటించారు. ఫహద్ ఫాజిల్ ఓ కీలక రోల్ చేశారు. విక్రమ్ కమల్ హాసన్ కి భారీ కమ్ బ్యాక్ ఇచ్చింది. కమర్షియల్ హిట్ చూసి కమల్ హాసన్ దశాబ్దాలు అవుతుంది. విక్రమ్ రూపంలో ఆయన ఊపిరి పీల్చుకున్నాడు. విక్రమ్ మూవీకి కమల్ హాసన్ నిర్మాత కూడాను. విక్రమ్ మూవీకి వచ్చిన లాభాలతో అప్పులు తీర్చుకున్నట్లు కమల్ హాసన్ స్వయంగా వెల్లడించారు. కమల్ హాసన్ పాత్రను లోకేష్ కనకరాజ్ తీర్చిదిద్దిన తీరు అద్భుతం అని చెప్పాలి.
విక్రమ్ కి లోకేష్ ఇచ్చిన ముగింపు మరో హైలెట్. డ్రగ్ మాఫియాకి అధిపతి అయిన రోలెక్స్ ని పరిచయం చేశాడు. అత్యంత క్రూరుడిగా రోలెక్స్ పాత్రలో సూర్య అదరగొట్టాడు. కొన్ని నిమిషాలతో కూడిన ఆ సీన్ పిచ్చగా నచ్చింది. LCU లో రోలెక్స్ కూడా ఉంది. ఈ మూవీ ఎప్పుడు పట్టాలెక్కుతుందని దర్శకుడు లోకేష్ కనకరాజ్ ని అడగ్గా, ఆయన సమాధానం చెప్పారు. రోలెక్స్ మూవీ ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే సూర్య సర్ కి కమిట్మెంట్స్ ఉన్నాయి. నేను కూడా కమిటై ఉన్నాను. అందుకే ఎప్పుడు అనేది చెప్పలేను అన్నారు.
కాగా లోకేష్ కనకరాజ్-రజినీకాంత్ కాంబోలో వస్తున్న కూలీ ఆగస్టు 14న విడుదల కానుంది. ఈ మూవీలో నాగార్జున ఓ కీలక రోల్ చేయడం విశేషం. కూలీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. కూలీ మూవీలో రజినీకాంత్ లుక్ ఆసక్తి రేపుతోంది. నాగార్జున పాత్ర కూడా చాలా ప్రత్యేకం అంటున్నారు. పూజా హెగ్డే ఐటమ్ సాంగ్ చేస్తున్నట్లు సమాచారం.
Also Read : ఆయన రుణం తీర్చుకోవాలని అనుకుంటున్న హిట్ 3 డైరెక్టర్, కానీ?