Vijay Deverakonda : తమిళ హీరో సూర్య(Suriya Sivakumar) నటించిన ‘రెట్రో'(Retro Movie) మూవీ తెలుగు వెర్షన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా హాజరైన విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), ఆ రోజు పాకిస్థాన్ ఉగ్రవాదులు చేసిన దాడి గురించి ఎమోషనల్ గా మాట్లాడిన సంగతి తెలిసిందే. అయితే అందుకు ఆయన ఆదివాసీయులను ఉదాహరణగా తీసుకొని మాట్లాడడం పెద్ద దుమారమే రేపింది. మన్యం జిల్లా ఆదివాసీ JAC సభ్యులు దీనిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. విజయ్ దేవరకొండ ఇలా మాట్లాడడం సరికాదని, తక్షణమే ఆయన దీనికి సమాధానం చెప్పాలంటూ మీడియా ముందు డిమాండ్ చేశారు. అంతే కాకుండా ఒక న్యాయవాది అయితే విజయ్ దేవరకొండ పై ఈ విషయం లో కేసు నమోదు చేయాలంటూ ఫిర్యాదు కూడా చేసాడు. కానీ పోలీసులు మాత్రం ఇంకా కేసుని నమోదు చేయలేదు. అయితే ఈ వివాదం పై విజయ్ దేవరకొండ కాసేపటి క్రితమే క్లారిటీ ఇచ్చాడు.
Also Read : విజయ్ దేవరకొండ బైక్ ఎక్కిన నాని… వివాదాలకు ఇలా చెక్ పెట్టారా?
ఆయన మాట్లాడుతూ ‘రీసెంట్ గా జరిగిన రెట్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నేను మాట్లాడిన కొన్ని మాటలు ఒక వర్గం మనోభావాలను దెబ్బ తీసినట్టుగా అనిపించింది అనే విషయం నా దృష్టిలోకి వచ్చింది. ఈ సందర్భంగా అలా నా మాటలను అపార్థం చేసుకున్న వారికి వివరణ ఇవ్వాలని అనుకుంటున్నాను. మొన్న నేను ఉద్దేశపూర్వకంగా ఏ వర్గాన్ని టార్గెట్ చేసి మాట్లాడలేదు. ముఖ్యంగా ఆదివాసీయుల మనోభావాలు దెబ్బతీయాలనే ఉద్దేశ్యం తో మాట్లాడిన మాటలు కాదు. మన దేశం లో అంతర్భాగం అయినటువంటి ఆదివాసీయులు అంటే నాకు ఎంతో గౌరవం ఉంది. నేను కేవలం ఐకమత్యంగా ఉండాలి అనే విషయం గురించే మాట్లాడాను. మన దేశానికీ ఏదైనా కష్టం వచ్చినప్పుడు కులం, మతం, ప్రాంతం అని లేకుండా అందరూ ఐకమత్యంగా నిలబడి పోరాడాలి అంటూ పిలుపునిచ్చాను’ అంటూ ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు విజయ్ దేవరకొండ.
ఇంకా ఆయన మాట్లాడుతూ ‘నేను ఆదివాసుల పేరుని ఎందుకు ఆరోజు తీసుకొచ్చానంటే, వందల ఏళ్ళ క్రితం మన మానవ జాతి ప్రస్తుత నాగరిక రాని రోజుల్లో ప్రపంచం మొత్తం ఆదివాసులు, వాళ్లకు సంబంధించిన క్లాన్స్ మాత్రమే ఉండేవి. అప్పటి మనుషులకు మంచి చెడు వంటివి తెలిసేవి కాదు. కేవలం వాళ్ళని ఉదాహరణగా తీసుకొని మాత్రమే నేను మాట్లాడాను. నేను ఇచ్చిన ఈ సందేశం లో మీరు నొచ్చుకునే విధంగా ఏమైనా మాట్లాడి ఉండుంటే మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్తున్నాను’ అంటూ విజయ్ దేవరకొండ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. దీంతో ఈ వివాదానికి తెరదించే ప్రయత్నం విజయ్ దేవరకొండ చేసాడు కానీ, ఆదివాసీ JAC శాంతించారో లేదో చూడాలి. ఇకపోతే విజయ్ దేవరకొండ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘కింగ్డమ్’ ఈ నెల 30 వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
Also Read : హే ఏంటి ఇంత ఛేంజ్.. మెడలో రుద్రాక్ష, కాషాయ వస్త్రాలు.. మహా కుంభమేళాలో విజయ్ దేవరకొండ
To my dear brothers ❤️ pic.twitter.com/QBGQGOjJBL
— Vijay Deverakonda (@TheDeverakonda) May 3, 2025