Star Heroine : స్టార్ హీరో కానీ, హీరోయిన్ కానీ పబ్లిక్ లోకి వచ్చినప్పుడు జనాలు విపరీతంగా వాళ్ళను చూసేందుకు ఎగబడటం సర్వ సాధారణం. వెండితెర మీద ఇన్నాళ్లు చూస్తూ పెరిగిన వాళ్ళు ఒక్కసారిగా బయట కనిపిస్తే అభిమానుల ఉత్సాహం ఎలా ఉంటుందో అర్థం చేసుకోగలం. కానీ కొంతమంది అభిమానులు నీచమైన బుద్ధి తో హీరోయిన్స్ ని ముట్టుకోని చోట ముట్టుకోని ఇబ్బందిని కలిగిస్తున్నారు. ఇలాంటి సంఘటనలు గతంలో చాలానే జరిగాయి. రీసెంట్ గానే శ్రీలీల ఒక ఈవెంట్ లో నడిచి వస్తుంటే ఒక అభిమాని ఆమె చెయ్యి పట్టుకొని ఈడ్చుకొని వెళ్లే ప్రయత్నం చేసాడు. అందుకు సంబంధించిన వీడియో అప్పట్లో సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఇప్పుడు ప్రముఖ మలయాళం హీరోయిన్ మంజు వారియర్(Manju warrier) కి కూడా అలాంటి అనుభవమే ఎదురైంది. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
Also Read : కెరీర్ ప్రారంభంలో బోల్డ్ సీన్స్ తో బాగా ఫేమస్.. రీసెంట్ గా టాలీవుడ్ స్టార్ హీరోని పెళ్లి చేసుకున్న నటీ…
విషయంలోకి వెళ్తే ఇటీవలే ఆమె ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి వెళ్ళింది. అక్కడ ఈమెని చూసేందుకు అభిమానులు భారీ స్థాయిలో వచ్చారు. మాల్ ఓపెనింగ్ తర్వాత లోపల నుండి బయటకి రావడం మంజు వారియర్ కి నరకప్రాయం గా మారింది. అడుగడుగునా అభిమానులు అడ్డుకొని ఆమెని సెల్ఫీలు అడగడం మొదలు పెట్టారు. పాపం ఆమె ఎలాంటి చిరాకు పడకుండా నవ్వుతూనే వాళ్ళని దాటుకుంటూ కార్ వద్దకు వచ్చింది. ఆ తర్వాత ఆమె అభిమానులకు రెండు మూడు సెల్ఫీలు కూడా ఇచ్చింది. అయితే అదే సమయం లో ఒక అభిమాని మంజూ వారియర్ నడుముని గిల్లి తన నీచ బుధ్హిని చూపించుకున్నాడు. అయితే మంజూ వారియర్ ఆ హడావుడిలో ఈ విషయాన్నీ పట్టించుకోలేదు. కానీ సోషల్ మీడియా లో ఈ వీడియో బాగా వైరల్ అవ్వడం తో నెటిజెన్స్ గమనించి, ఆమెతో అలా ప్రవర్తించిన వారిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు.
ఒక సినీ సెలబ్రిటీ విషయం లోనే ఇలా ప్రవర్తిస్తే, సాధారణ స్త్రీలను ఇలాంటి దుర్మార్గుల నుండి ఎలా కాపాడుకోవాలి అంటూ సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు. ఇక మంజు వారియర్ విషయానికి వస్తే ఈమె మలయాళం సినీ ఇండస్ట్రీ లో పెద్ద సూపర్ స్టార్. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో హీరోయిన్ గా నటించి కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుంది. ఈమె నటనకు ఎన్నో అవార్డులు, రివార్డులు వచ్చాయి. రీసెంట్ గా ఈమె సూపర్ స్టార్ రజినీకాంత్ తో ‘వెట్టియాన్’, విజయ్ సేతుపతి తో ‘విడుదలై -2’, మోహన్ లాల్ తో ‘L2 ఎంపురాన్’ చిత్రాల్లో నటించింది. ముఖ్యంగా వెట్టియాన్ చిత్రం లోని ఒక పాటలో ఈమె వేసిన స్టెప్పులు ఎంత హైలైట్ గా నిల్చాయో మన అందరికీ తెలిసిందే. సూపర్ స్టార్ రజినీకాంత్ ని కూడా డామినేట్ చేసింది ఈమె. అయితే సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న ఆ వీడియో ని మీరు కూడా చూసి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.
Also Read : ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోలకు జోడిగా నటించింది.. ప్రస్తుతం ఎంపీగా బిజీ బిజీ.. ఎవరో గుర్తుపట్టారా..
Awful behaviour from the crowd having no sense of boundary or respect towards the actress !#ManjuWarrier pic.twitter.com/6YYEpCDUQu
— Mollywood BoxOffice (@MollywoodBo1) May 2, 2025