The Girlfriend Collection Day 2: రష్మిక మందాన మెయిన్ లీడ్ లో రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో వచ్చిన ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమా రీసెంట్ గా రిలీజ్ అయింది. ఈ సినిమా ప్రేక్షకులందరిని మెప్పిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ మొదటి షో తోనే యావరేజ్ టాక్ ను సంపాదించుకుంది… భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకి చాలా తక్కువ కలెక్షన్స్ వచ్చాయి. మొదట్లో రెండు రోజుల్లో ఈ సినిమా కేవలం 3 కోట్ల 80 లక్షల కలెక్షన్స్ ను మాత్రమే వసూలు చేసినట్టుగా తెలుస్తోంది. మొదటి రోజు ఒక కోటి 30 లక్షల కలెక్షన్స్ ని రాబట్టిన ఈ సినిమా, రెండోరోజు 2 కోట్ల 50 లక్షల కలెక్షన్స్ ను రాబట్టింది.
మొత్తానికైతే ఈ సినిమా మీద రాహుల్ రవీంద్రన్ చాలా ఆశలైతే పెట్టుకున్నాడు. మరి దానికి తగ్గట్టుగానే ఈ సినిమా భారీ విజయాన్ని సాధిస్తోంది అనుకున్నప్పటికి బాక్సాఫీస్ వద్ద అంత సత్తా చాటలేదనే చెప్పాలి…మొదటి రోజు 30 వేల టికెట్లు అమ్ముడుపోగా, రెండో రోజు 68 వేల టికెట్ల వరకు అమ్ముడుపోయినట్టుగా తెలుస్తోంది.
ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే భారీ కలెక్షన్స్ ను కొలగొట్టాల్సిన అవసరమైతే ఉంది. ఇక రష్మిక మందాన లాంటి టాప్ హీరోయిన్ ఈ సినిమాలో ఉన్నా కూడా ఈ సినిమాని ఎవరు పెద్దగా పట్టించుకోకపోవడం నిజంగా చాలా దారుణమైన విషయమనే చెప్పాలి. ఇక ఈ వీకెండ్ లో ఈ సినిమా ఎంతటి కలెక్షన్స్ రాబట్టిన కూడా మరుసటి వీక్ లో మాత్రం సినిమా భారీగా డల్ అయ్యే అవకాశాలైతే ఉన్నాయి.
ఇక దానికి తోడుగా ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ అనే చిన్న సినిమా భారీ విజయాన్ని సాధించడంతో ఇప్పుడు అందరు ఆ సినిమాని చూడడానికే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. కాబట్టి ఈ సినిమాని ఎవరు పట్టించుకోవడం లేదనే వార్తలు కూడా వస్తున్నాయి. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఈ సినిమా కలెక్షన్స్ ఏమైనా ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయా లేదా అనేది…