Rashmika : మన టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లిస్ట్ తీస్తే అందులో ప్రముఖ యంగ్ హీరో విజయ్ దేవరకొండ పేరు కచ్చితంగా ఉంటుంది. ఈయన నేషనల్ క్రష్ గా పిలవబడే రష్మిక తో ప్రేమాయణం నడుపుతున్నాడు అనేది ఓపెన్ సీక్రెట్. కానీ ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ రష్మిక ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఇంట్లోనే ఉంటుంది అనేది ఫిలిం నగర్ లో జోరుగా ప్రచారం అవుతున్న వార్త. ఇద్దరు కలిసి షాపింగ్ కి వెళ్లడం, జిమ్ వర్కౌట్స్ అయ్యాక కాఫీ షాప్ లో కనిపించడం. ఆ తర్వాత విజయ్ దేవర కొండా కుటుంబం లో ప్రైవేట్ ఫంక్షన్ జరిగినా అందులో కచ్చితంగా రష్మిక ఉండడం, వాటికి సంబంధించిన ఫోటోలు వీళ్ళు పబ్లిక్ గా సోషల్ మీడియా లో అప్లోడ్ చేయకపోయినా అభిమానులు అప్లోడ్ చేసి వైరల్ చేసారు. రష్మిక కూడా అనేక సందర్భాల్లో పరోక్షంగా విజయ్ తో డేటింగ్ లో ఉన్నట్లు హింట్స్ ఇచ్చింది.
రీసెంట్ గా విడుదలైన ‘పుష్ప 2 ‘ చిత్రానికి కూడా ఆమె AMB మాల్ లో విజయ్ దేవరకొండ కుటుంబం తో కలిసి వచ్చి చూసింది. దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి కూడా. ఇలా అభిమానులందరికీ తెలిసిపోయినప్పటికీ కూడా ఎందుకో ఈ జంట ఇంకా అధికారికంగా ప్రకటించకుండా సైలెంట్ గా ఉన్నారు. ఇది ఇలా ఉండగా రీసెంట్ గా విజయ్ దేవరకొండ తన ఇంస్టాగ్రామ్ లో అకౌంట్ స్టోరీ లో పెట్టిన రజినీకాంత్ మేము వీడియో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆ మేము వీడియో పైన ‘కనీసం 2025 లో అయినా పెళ్లి చేసుకుంటావా’ అని ఉంటుంది. దానికి రజినీకాంత్ ఒక ఇంటర్వ్యూ లో సమాధానం చెప్పలేక నవ్వే వీడియో ని అటాచ్ చేసి తన స్టోరీ లో అప్లోడ్ చేసాడు.
అంటే దీనికి అర్థం వచ్చే ఏడాది లో కూడా విజయ్ దేవరకొండ కి పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం లేదని తెలుస్తుంది. ఇలా ఆయన ఎన్నేళ్లు సైలెంట్ గా ఉంటాడు?, అసలు పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం ఉందా?, లేదా ఇలాగే రష్మిక తో లివింగ్ రిలేషన్ ని మైంటైన్ చేస్తాడా అనేది తెలియాల్సి ఉంది. ఇక విజయ్ దేవరకొండ కెరీర్ విషయానికి వస్తే, ప్రస్తుతం ఆయన వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ లో ఉన్నాడు. మధ్యలో వచ్చిన ఖుషి చిత్రం యావరేజ్ గా ఆడినప్పటికీ, లైగర్ మరియు ఫ్యామిలీ స్టార్ చిత్రాలు ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్స్ గా నిలిచి విజయ్ దేవరకొండ కెరీర్ ని డైలమా లో పడేసేలా చేసాయి. ఇప్పుడు ఆయన సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థలో జెర్సీ డైరెక్టర్ ‘గౌతమ్ తిన్ననూరి’ తో ఒక సినిమా చేస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ ని జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.