Rajamouli : రాజమౌళి తన ప్రతీ సినిమాకి మన టాలీవుడ్ ఇండస్ట్రీ పరిధి ని పెంచుకుంటూ పోతున్న సంగతి మనమంతా చూస్తూనే ఉన్నాం. మన తెలుగు సినిమాకి ఇంతటి గుర్తింపు రావడానికి ప్రధాన కారణం రాజమౌళి నే. ఆయన లేకపోతే పాన్ ఇండియా లెవెల్ లో మన హీరోలు ఈరోజు సినిమాలు చేసేవాళ్ళు కాదు. #RRR చిత్రం తో అయితే ఏకంగా ఆయన ఇంటర్నేషనల్ మార్కెట్ ని కూడా మన తెలుగు సినిమా పరిశ్రమకి ఓపెన్ అయ్యేలా చేసాడు. ఇప్పుడు మన సినిమాల కోసం కేవలం ఇండియన్ ఆడియన్స్ మాత్రమే కాదు, విదేశీ ఆడియన్స్ కూడా ఎదురు చూస్తున్నారు. అంతే కాకుండా ఇండియన్స్ చిరకాల కల ఆస్కార్ అవార్డు ని కూడా రాజమౌళి #RRR చిత్రం ద్వారా నెరవేర్చాడు. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు తో చెయ్యబోయే సినిమా తో ఏకంగా హాలీవుడ్ మార్కెట్ ని కబ్జా చేసే పనిలో ఉన్నాడు రాజమౌళి.
ఈ చిత్రం కోసం హాలీవుడ్ స్టార్ నటులను మాత్రమే కాదు, హాలీవుడ్ టెక్నీషియన్స్ ని కూడా పెట్టుకున్నాడు. ఇప్పటికే థోర్ మూవీ హీరో క్రిస్ హేమ్ వర్త్ ని ఈ చిత్రం లో కీలక పాత్ర కోసం సంప్రదించినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అదే విధంగా రాజమౌళి ఇప్పుడు మరో ప్రముఖ హాలీవుడ్ స్టార్ ని ఈ చిత్రం కోసం తీసుకునే ఆలోచనలో ఉన్నాడట. ఆమె హాలీవుడ్ లో ఒకప్పుడు సూపర్ స్టార్స్ ని మించిన రెమ్యూనరేషన్ ని అందుకునేది. ‘గ్రావిటీ’ చిత్రం లో ఆమె నటించినందుకు గాను ఏకంగా 600 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని అందుకుంది. ఆమె పేరు సండ్రా బుల్లక్. ఈమె హాలీవుడ్ లో హీరోయిన్ గా, క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా ఎన్నో వందల సినిమాల్లో నటించింది. అలాంటి ఆర్టిస్ట్ ని రాజమౌళి పట్టుకొస్తున్నాడు.
కేవలం హాలీవుడ్ మాత్రమే కాదు, బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ ఇలా అన్ని ఇండస్ట్రీల నుండి స్టార్ నటులను పోగు చేస్తున్నాడు రాజమౌళి. వెయ్యి కోట్ల రూపాయలకు పైగా భారీ బడ్జెట్ తో నిర్మాణం కాబోతున్న ఈ సినిమా కార్య రూపం దాల్చడానికి సుమారుగా 12 ఏళ్ళ సమయం పట్టింది. జనవరి నెలలో ఈ చిత్రం షూటింగ్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తీసే ఆలోచనలో ఉన్నారని, మొదటి భాగం 2027 వ సంవత్సరం లో, అదే విధంగా రెండవ భాగం 2029 వ సంవత్సరం లో విడుదల చేయబోతున్నారట. ఈ చిత్రం కోసం మహేష్ బాబు ఎలాంటి లుక్ లోకి మారిపోయాడో మీరంతా చూస్తూనే ఉన్నారు. అది కేవలం టీజర్ మాత్రమే, సినిమాలో మహేష్ బాబు లుక్ ఎవ్వరూ ఊహించని విధంగా ఉండబోతుందని అంటున్నారు.