Vijay Deverakonda Kingdom: ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అతితక్కువ సమయంలో, కేవలం రెండు మూడు చిత్రాలతోనే యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్,ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda). కానీ కేవలం కెరీర్ ప్రారంభం లో వచ్చిన ఆ రెండు మూడు కమర్షియల్ హిట్స్ తప్ప, విజయ్ దేవరకొండ కి మరో సూపర్ హిట్ సినిమా లేదు. సూపర్ హిట్స్ లేకపోయినా పర్లేదు. వరుసగా డిజాస్టర్ ఫ్లాప్స్ వస్తున్నాయి. ‘లైగర్’ అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రం చేసాడు. ఇది కమర్షియల్ గా ఎంత పెద్ద డిజాస్టర్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆ తర్వాత ఈయన నుండి ‘ఖుషి’ అనే చిత్రం విడుదలైంది. మ్యూజిక్ పరంగా ఈ సినిమా పెద్ద హిట్. కానీ కమర్షియల్ గా మాత్రం ఫ్లాప్ అయ్యింది. ఇక ఆయన గత చిత్రం ‘ది ఫ్యామిలీ స్టార్’ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
Also Read: సుజీత్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతో చేయబోతున్నాడా..?
ఇలాంటి కష్టమైన సమయంలో ఆయన కెరీర్ ముందుకు వెళ్లాలంటే కచ్చితంగా ఒక భారీ హిట్ కావాలి. ఆ హిట్ ‘కింగ్డమ్'(Kingdom Movie) రూపం లో వస్తుందని విజయ్ దేవరకొండ అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. టీజర్ పెద్ద హిట్ అవ్వడం తో ఈ చిత్రం పై అంచనాలు భారీ గా పెరిగాయి. విజయ్ దేవరకొండ ఈసారి పాన్ ఇండియా లెవెల్ లో రీ సౌండ్ వచ్చేలా కొట్టబోతున్నాడు అని అంతా అనుకున్నారు. కానీ ఇప్పటికే ఈ చిత్రం రెండు సార్లు వాయిదా పడింది. ముందుగా మే 31 న విడుదల చెయ్యాలని అనుకున్నారు. కానీ అప్పటికీ సినిమా రెడీ కాకపోవడం జులై నాల్గవ తేదీన విడుదల చేయాలనీ అనుకున్నారు. కానీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వర్క్ పూర్తి కాకపోవడం, సెకండ్ హాఫ్ లో అనేక సన్నివేశాలు రీ షూట్ చేయాల్సిన అవసరం రావడంతో మేకర్స్ మరోసారి వాయిదా వేశారు.
ఇప్పుడు ఈ చిత్రాన్ని ఎప్పుడు విడుదల చెయ్యాలో తెలియాలి పరిస్థితిలో ఉన్నాడు ఆ చిత్ర నిర్మాత సూర్య దేవర నాగవంశీ. జులై 25 న విడుదల చెయ్యాలని అనుకున్నారు. కానీ జులై 24 న పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’ విడుదల కాబోతుంది. పవన్ కళ్యాణ్ తో నాగవంశీ కి ఎంతో సాన్నిహిత్యం ఉంది, అంతే కాకుండా ‘హరి హర వీరమల్లు’ చిత్రం తో పోటీ అంటే చిన్న విషయం కాదు. ‘కింగ్డమ్’ కూడా భారీ బడ్జెట్ తో నిర్మించిన సినిమానే. థియేటర్స్ భారీ గా అవసరం ఉంటుంది. కాబట్టి ఆ తేదీన ఇప్పుడు రాలేదు. ఆగష్టు మొదటి వారం లో విడుదల చేయాలనుకుంటే ఆగష్టు 14 న ‘వార్ 2’, ‘ కూలీ’ చిత్రాలు ఉంటాయి. కేవలం వారం రోజుల ఫ్రీ రన్ మాత్రమే దొరుకుంటుంది. ఇది కూడా వర్కౌట్ అవ్వదు. ఇప్పుడు ఎలా రిలీజ్ చెయ్యాలి అనే ఆలోచనలో మునిగిపోయి ఉన్నాడట నిర్మాత. దానికి తోడు సినిమా కూడా ఇంకా పూర్తి కాలేదని అంటున్నారు.