Chiranjeevi And Anil Ravipudi: మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ప్రస్తుతం అనిల్ రావిపూడి(Anil Ravipudi) తో ఒక సినిమా చేస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే. రీసెంట్ గానే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలై అప్పుడే రెండు షెడ్యూల్స్ పూర్తి అయ్యింది. ఇందులో మెగాస్టార్ చిరంజీవి ధ్రిల్ మాస్టర్ గా, CID ఆఫీసర్ గా నటించబోతున్నాడు. ప్రస్తుతం మూడవ షెడ్యూల్ జరుగుతుంది. ఈ షెడ్యూల్ కి సంబంధించిన షూటింగ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. అనిల్ రావిపూడి చిరంజీవి కి సన్నివేశాన్ని వివరిస్తూ ఉన్నాడు. పక్కనే ‘సంక్రాంతికి వస్తున్నాం’ బుడ్డోడు బుల్లిరాజు కూడా ఉన్నాడు. ఎదో ఒక మంచి కామెడీ సన్నివేశాన్ని చిత్రీకరిస్తూ ఉన్నట్లుగా ఈ వీడియో ని చూస్తే అనిపిస్తుంది. మెగాస్టార్ కూడా మంచి మూడ్ లో ఎనర్జీ తో కనిపిస్తున్నాడు. ఆయన లుక్స్ కూడా అదిరిపోయాయి.
Also Read: సుజీత్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతో చేయబోతున్నాడా..?
2026 సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం లో నయనతార(Nayanthara) హీరోయిన్ గా నటిస్తుంది. కేథరిన్ థెరిసా రెండవ హీరోయిన్ గా నటిస్తుంది. అదే విధంగా ఈ చిత్రం లో విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) ఒక కీలక పాత్ర పోషిస్తున్నాడు. తదుపరి షెడ్యూల్ లో వెంకటేష్ పాల్గొనబోతున్నాడు. చిరంజీవి, వెంకటేష్ కాంబినేషన్ లో కొన్ని సన్నివేశాలతో పాటు, వెంకటేష్ కి ప్రత్యేకంగా ఒక పాట, ఒక ఫైట్ సన్నివేశం ఉంటుందట. ఈ క్యారక్టర్ ఫ్లాష్ బ్యాక్ లో వస్తుందా?,లేకపోతే వర్తమానం లో వస్తుందా అనేది సస్పెన్స్. నిన్నటి తరం హీరోలలో చిరంజీవి, వెంకటేష్ కి ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ అత్యధిక శాతం ఈ ఇద్దరి హీరోల చుట్టూనే తిరిగేవి. ఇద్దరు కూడా కామెడీ టైమింగ్ లో,ఎమోషనల్ సన్నివేశాల్లో పేకాడేస్తారు. వీళ్ళ కాంబినేషన్ లో సినిమా కావాలని అభిమానులు, మూవీ లవర్స్ ఎంతో కాలం నుండి ఎదురు చూస్తున్నారు.
వాళ్ళ ఎదురు చూపులకు ఈ చిత్రం ద్వారా తెరపడనుంది. అదే విధంగా చిరంజీవి అభిమానులు ఈ చిత్రం కచ్చితంగా భారీ హిట్ అవ్వాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే మెగాస్టార్ గత చిత్రం ‘భోళా శంకర్’ అభిమానులకు చేదు జ్ఞాపకాలను మిగిలించింది. అదే విధంగా మెగాస్టార్ మరో చిత్రం ‘విశ్వంభర’ షూటింగ్ పూర్తి అయ్యి విడుదలకు నోచుకోలేదు. ఈ సినిమా పై ఉన్న నెగటివిటీ ప్రస్తుతం ఏ సినిమా మీద కూడా లేదు. విడుదలై సూపర్ హిట్ అవుతుంది అనే నమ్మకం మెగా ఫ్యాన్స్ లో కూడా లేదు. అందుకే అనిల్ రావిపూడి ప్రాజెక్ట్ పై కోటి ఆశలు పెట్టుకున్నారు మెగా ఫ్యాన్స్.
#Mega157@KChiruTweets pic.twitter.com/BeyCDMt2Wm
— RCharan REDDY ⭐PRECIDENT OF RAM CHARAN FAN (@CharanR12520030) June 29, 2025