https://oktelugu.com/

‘క్రాక్’తో సీరియస్ అయిన రవితేజ !

‘మాస్ మహారాజా’ రవితేజ సినిమాలు ప్రస్తుతం అటు మాస్ లో ఆడట్లేదు, ఇటు క్లాస్ లో ఆడట్లేదు. అసలు నిజం చెప్పుకుంటే.. రవితేజ ఏ సినిమా చేసినా భారీ ప్లాప్ అవుతుంది. గత ఏడు సినిమాలుగా సక్సెస్ కోసం యుద్ధం చేస్తున్నా.. మాస్ రాజాకి హిట్ రావడం కష్టమైపోయింది. ఈ ఏడాది ఆరంభంలో కూడా ‘డిస్కో రాజ’ అంటూ పలకరించిన రవితేజ బాగా నిరాశ పరిచాడు. ఇక రవితేజ చేస్తున్న కొత్త చిత్రం ‘క్రాక్’. గోపిచంద్ మలినేని […]

Written By:
  • admin
  • , Updated On : November 17, 2020 / 07:14 PM IST
    Follow us on


    ‘మాస్ మహారాజా’ రవితేజ సినిమాలు ప్రస్తుతం అటు మాస్ లో ఆడట్లేదు, ఇటు క్లాస్ లో ఆడట్లేదు. అసలు నిజం చెప్పుకుంటే.. రవితేజ ఏ సినిమా చేసినా భారీ ప్లాప్ అవుతుంది. గత ఏడు సినిమాలుగా సక్సెస్ కోసం యుద్ధం చేస్తున్నా.. మాస్ రాజాకి హిట్ రావడం కష్టమైపోయింది. ఈ ఏడాది ఆరంభంలో కూడా ‘డిస్కో రాజ’ అంటూ పలకరించిన రవితేజ బాగా నిరాశ పరిచాడు. ఇక రవితేజ చేస్తున్న కొత్త చిత్రం ‘క్రాక్’. గోపిచంద్ మలినేని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. లాక్ డౌన్ ముందే సగం షూటింగ్ పూర్తికాగా ఈమధ్యే తిరిగి చిత్రీకరణ స్టార్ట్ చేశారు. ఇప్పటికే సినిమా ఆలస్యం కావడంతో బ్యాలెన్స్ పార్ట్ ను వేగంగా షూట్ చేశారు.

    Also Read: ‘ఆర్ఆర్ఆర్’ విలన్ ట్రాక్ ఇదే !

    అయితే ఆ తరువాత రషెస్ చూసుకున్న రవితేజకు అవుట్ ఫుట్ అస్సలు నచ్చకపోవడంతో డైరెక్టర్ కు రీషూట్ చేయాలని సూచించాడు. గత వారం వరకూ ఆ సన్నివేశాల రీషూట్ ఒంగోలులో జరిగింది. అయితే తాజాగా ఈ సినిమా రఫ్ ఎడిటింగ్ పూర్తి అయిందట. ఓవరాల్ గా సినిమా వేసుకుని చూసుకున్న రవితేజకు సినిమాలో కొన్ని సన్నివేశాలు అంత సంతృప్తికరంగా అనిపించలేదట. దాంతో డైరెక్టర్ పై కాస్త సీరియస్ అయినట్టు తెలుస్తోంది. చెప్పింది ఒకటి, తీసింది ఒకటి అంటూ రవితేజ సీరియస్ గా లేచి వెళ్లిపోయాడట. మొత్తానికి రవితేజ రియాక్షన్ తో గోపిచంద్ మలినేని షాక్ కి గురయ్యాడట.

    Also Read: పాపం బోయపాటి.. మళ్లీ మొదటికొచ్చింది !

    నిజానికి రవితేజ క్రాక్ సినిమా పై భారీ హోప్స్ పెట్టుకున్నాడు. ఎందుకంటే రవితేజ బోలెడు ఆశలుపెట్టుకున్న ‘డిస్కో రాజా’ ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో ఎలాగైనా క్రాక్ సినిమాతో సాలిడ్ హిట్ అందుకోవాలని మెంటల్ గా ఫిక్స్ అయిపోయాడు. అందుకే ఈ సినిమా అవుట్ ఫుట్ లో ఎక్కడా చిన్న పొరపాటు జరిగినా దాన్ని చాలా సీరియస్ గా తీసుకుంటున్నాడు. మొదటినుండి క్రాక్ సినిమాలో చిన్న లోపం కూడ లేకుండా మొత్తం సినిమా ముందుగా అనుకున్న రీతిలో వచ్చేలా రవితేజ కూడా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. ఇన్నీ చేసినా.. చివరకు తనకు సినిమా నచ్చకపోయేసరికి బహుశా రవితేజ ఇలా బిహేవ్ చేసి ఉంటాడు. ఇక ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇందులో శృతిహాస‌న్ హీరోయిన్‌గా నటిస్తోంది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్