spot_img
Homeఎంటర్టైన్మెంట్Vijay Deverakonda First Salary: విజయ్ దేవరకొండ మొదటి సాలరీ ఎంత..? ఇప్పుడు ఎంత సంపాదిస్తున్నాడంటే..?

Vijay Deverakonda First Salary: విజయ్ దేవరకొండ మొదటి సాలరీ ఎంత..? ఇప్పుడు ఎంత సంపాదిస్తున్నాడంటే..?

Vijay Deverakonda First Salary: ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా మారిపోయిన నటుడు విజయ్ దేవరకొండ… ఆయన చేసిన సినిమాలు ఆ తర్వాత పెద్దగా సక్సెస్ లను సాధించకపోయిన కూడా తన మార్కెట్ మాత్రం పదిలంగానే ఉంది. గత సంవత్సరం చేసిన ‘కింగ్ డమ్’ సినిమా ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేదు. అయిన కూడా ఆయనకు భారీ ఆఫర్లు వస్తున్నాయి. ప్రస్తుతం రవికిరణ్ కోలా దర్శకత్వంలో ‘రౌడీ జనార్ధన్’ అనే సినిమా చేస్తున్నాడు. ఇక దాంతోపాటుగా రాహుల్ సంకృత్యాయన్ దర్శకత్వంలో ‘రణబాలి’ అనే సినిమాని కూడా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలతో పాటుగా మరోసారి ఇతను ఫామ్ లోకి రావాలని చూస్తున్నాడు. తన తోటి హీరోలందరు సూపర్ సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తుంటే ఆయన మాత్రం ఇంకా సక్సెస్ ల కోసం విపరీతంగా ఎదురుచూస్తున్నాడు.

Also Read: రేవంత్ రెడ్డి మూడు ముక్కలాట..!

కాబట్టి ఈ రెండు సినిమాలను ఎలాగైనా సరే సూపర్ సక్సెస్ లుగా నిలపాలనే ఉద్దేశ్యంతోనే తను ఉన్నాడట. ఆయన అనుకున్నట్టుగానే ఈ సినిమాను దర్శకులు తెరకెక్కిస్తున్నారా లేదా అనేది తెలియాల్సి ఉంది ఇప్పటివరకు విజయ్ దేవరకొండ చేసిన ప్రతి సినిమాలో తన ఐడెంటిటి అయితే కనిపించింది. ఇక ఈ సినిమాల్లో సైతం తన మార్కు ను చూపిస్తూ నటించి మెప్పిస్తాడట.

విజయ్ దేవరకొండ రీసెంట్ గా రష్మిక మందానని పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే…కెరియర్ స్టార్టింగ్ లో చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. వచ్చిన అవకాశాన్ని వాడుకుంటూ ముందుకు సాగాడు. తన కెరియర్ లో తన మొదటి సంపాదనగా 1000 రూపాయల అమౌంట్ అయితే వచ్చిందని ఒక ఇంటర్వ్యూలో తెలియజేశాడు.

ప్రస్తుతం ఆయన దాదాపు 10 నుంచి 15 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అయితే తీసుకుంటున్నాడు… మొత్తానికైతే ఆయన ఇప్పుడు ఒక స్టార్ హీరోగా గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా ఇప్పుడున్న హీరోలకు సైతం తను పోటీ ఇచ్చే విధంగా మారుతున్నాడు. ఇక తొందర్లోనే తను కూడా టైర్ వన్ హీరోగా మారతాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular