Vijay Deverakonda distancing from friends: ‘పెళ్లిచూపులు’ సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పించిన నటుడు విజయ్ దేవరకొండ… ఆ తర్వాత చేసిన ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో యూత్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. ఆయన లాంటి నటుడు ఎవరు లేరనే పేరును కూడా మూటగట్టుకున్నాడు. ఇక అప్పుడున్న స్టార్ హీరోలందరికి విజయ్ నటనను చూసి చెమటలు పట్టాయనే చెప్పాలి. ఇండస్ట్రీకి మరో స్టార్ హీరో వచ్చాడు అంటూ చాలామంది అతని మీద ప్రశంసల వర్షం కురిపించారు… రీసెంట్ గా విజయ్ దేవరకొండ – రష్మిక మందాన ను పెళ్లి చేసుకున్నాడు… చాలా రోజుల నుంచి సాగుతున్న వాళ్ల ప్రేమకు పెళ్ళితో పులిస్టాప్ పెట్టారు. గత కొద్ది రోజుల నుంచి ఆయన చేస్తున్న సినిమాలన్నీ ఫ్లాప్ అవుతున్నాయి. అయినప్పటికి తను ఎక్కడ తగ్గకుండా డిఫరెంట్ కాన్సెప్ట్ లను ఎంచుకొని మరి సినిమాలు చేస్తున్నాడు. కెరియర్ స్టార్టింగ్ లో విజయ్ దేవరకొండ చేసిన ప్రతి సినిమాలో ఫ్రెండ్ క్యారెక్టర్లను పోషిస్తూ వచ్చిన ప్రియదర్శి, రాహుల్ రవీంద్రన్ ఇప్పుడు ఆయన సినిమాల్లో పెద్ద కనిపించడం లేదు. నిజానికి వీళ్ళు ముగ్గురు చాలా క్లోజ్ ఫ్రెండ్స్… అయిన కూడా ఈ మధ్య కాలం లో వీళ్ళు కలిసి నటించకపోవడానికి గల కారణం ఏంటంటే విజయ్ వాళ్ళిద్దరిని పక్కన పెట్టాడనే వార్తలైతే వస్తున్నాయి…
ఎందుకని విజయ్ వాళ్ళిద్దర్నీ పక్కన పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది అనే ధోరణిలో కూడా కొన్ని అభిప్రాయాలైతే వ్యక్తమవుతున్నాయి. విజయ్ మీద వాళ్లు కొన్ని బ్యాడ్ కామెంట్లు చేశారని అందువల్లే విజయ్ వాళ్ళను తన సినిమాలో తీసుకోవడం లేదని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఇక మరి కొంతమంది మాత్రం ప్రియదర్శి హీరోగా మారి సినిమాలు చేస్తున్నాడు.
Also Read: సౌత్ డైరెక్టర్లకు సినిమాలు చేయడం రాదు..అందుకే ఆ సీన్స్ పెడుతారు అంటున్న స్టార్ హీరోయిన్స్…
ఇలాంటి సమయంలో తను చేయగలిగే క్యారెక్టర్ తనకి దొరకడం లేదని అందుకే విజయ్ తో నటించే అవకాశం లేకుండా పోయిందని కామెంట్స్ చేస్తున్నారు. ఇక రాహుల్ రవీంద్రన్ సైతం డిఫరెంట్ సబ్జెక్ట్ లను ఎంచుకొని ముందుకు సాగుతున్నాడు. కాబట్టి విజయ్ తో సినిమా చేసే అవకాశం రావడం లేదు.
అందువల్లే వీళ్ళిద్దరు విజయ్ దేవరకొండ సినిమాలో నటించడం లేదు. అంతే తప్ప వీళ్లకు పర్సనల్ గా గొడవలైతే ఏమీ లేవని ఎవరికి వాళ్ళు బిజీగా ఉండడం వల్లే ఒకరి సినిమాలో మరొకరు చేయలేకపోతున్నారు అంటూ సమాధానం చెబుతున్నారు. ఇక ఇందులో ఎంతవరకు నిజముంది అనేది తెలియదు కానీ మొత్తానికైతే ఈ ముగ్గురి కాంబినేషన్ లో ఏదైనా ఒక సినిమా వస్తే చూడాలని ప్రతి ఒక్కరు ఆసక్తి ఎదురు చూస్తున్నారు…